ETV Bharat / city

చిన్నారులపై వరకట్నం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన పెద్దలు - dowry harassment case registerd in gunttor news

వరకట్న వేధింపుల ఆరోపణలతో దాఖలైన కేసులో.. చిన్నారులపైనా అభియోగాలు నమోదయ్యాయి. ఇది అధికార దుర్వినియోగమే అని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు.

A case registerd of dowry harassment of little girls by guntoor town women police station
author img

By

Published : Oct 30, 2019, 8:43 AM IST

వరకట్న వేధింపుల కింద నమోదైన ఓ కేసులో గుంటూరు పట్టణ మహిళా ఠాణా పోలీసులు నలుగురు చిన్నారుల పేర్లను చేర్చటంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. తమ పిల్లలపై నమోదైన కేసును కొట్టివేయాలని చిన్నారులకు సంబంధించిన పెద్దలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా చంద్రాపురానికి చెందిన పి. బిందువుకు ఇటీవల వివాహం జరిగింది. ఆమె భర్త, అత్తమామ, ఆడపడచులు, వారి భర్తలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఈ ఏడాది సెప్టెంబరు 26న పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అందరిపై వరకట్న వేధింపులు, భారత శిక్షా స్మృతి సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేశారు. వారితో పాటు 6, 9, 11 ఏళ్ల వయస్సున్న ఆడపడచుల కుమారులు, కుమార్తెలనూ నిందితులుగా చేర్చారు. తమతో పాటు చిన్నారులపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. చిన్న పిల్లలను నిందితులుగా చేర్చటం అధికారాన్ని దుర్వినియోగ పర్చటమేనని పిటిషన్లో పేర్కొన్నారు. తమకు సంబంధం లేకపోయినా పోలీసులు... కేసు నమోదు చేశారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

ఇవాళ కేబినెట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలివే!

Intro:Body:

ap_vja_09_30_high_court_on_varakatnam_case_av_3182ap_vja_09_30_high_court_on_varakatnam_case_av_3182ap_vja_09_30_high_court_on_varakatnam_case_av_3182

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.