దుబాయ్లో పనికి వెళ్తున్న తండ్రిని ఎయిర్పోర్టులో దింపి.. కుటుంబ సభ్యులతో కలిసి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు(two killed in road accident). ఈ ఘటన మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం తుర్కపల్లి(accident at turkapally) రాజీవ్ రహదారిపై జరిగింది(two killed where A car collided container).
జగిత్యాల(jagtial) జిల్లా స్తంభాలపల్లికి చెందిన సుదర్శన్, అతని పెదనాన్న కుమారుడు రాజేందర్, మరోవ్యక్తితో కలిసి.. దుబాయ్లో పనికి వెళ్తున్న సుదర్శన్ తండ్రిని శంషాబాద్ విమానాశ్రయంలో దింపేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం తుర్కపల్లి సమీపంలో జాతీయ రహదారిపై నిలిపిఉన్న కంటైనర్ను వీరి కారు వెనుకనుంచి ఢీకొట్టింది(car collided a container) .
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న రాజేందర్, పక్కనే ఉన్న సుదర్శన్ ఘటనాస్థలిలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వంశీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: