- రాష్ట్రంలో కొత్తగా 5,145 కరోనా కేసులు, 31 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 5,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 31 మంది మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వైరస్ కేసులు 7,44,864కు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలి: సీఎం
రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీతో పాటు అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలని స్పష్టం చేశారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఏపీ రిలీవ్ చేసినా తెలంగాణ చేర్చుకోలేదు'
తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఏపీ సంస్థలు రిలీవ్ చేసినా తెలంగాణ సంస్థలు చేర్చుకోలేదని ఉద్యోగుల పిటిషన్ వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ ఎన్నికలు నిర్వహించలేమని హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాధి తీవ్రత దృష్ట్యా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై మీ వివరణ ఏంటో చెప్పాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆధార్ తరహాలో ప్రాపర్టీ కార్డులు
గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించేందుకు తీసుకొచ్చిన స్వామిత్వ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రాపర్టీ కార్డులను ఆదివారం అందజేయనున్నారు. ఆరు రాష్ట్రాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాసవాన్ మృతితో బిహార్ ఎన్నికలపై భారీ ప్రభావం!
వర్తమాన రాజకీయాల్లో దళిత దిగ్గజంగా పేరొందిన కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాసవాన్ మరణం.. బిహార్ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జనంలోకి వస్తోన్న ట్రంప్!
కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కొవిడ్ చికిత్స పూర్తైంది. శనివారం నుంచి ఆయన బహిరంగ కార్యక్రమాలకు హాజరుకాగలరని శ్వేతసౌధం వైద్యుడు సియాన్ కాన్లే వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్విస్ రెండో జాబితా విడుదల
స్విస్ బ్యాంకు ఖాతాదారుల రెండో జాబితాను భారత్‌కు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందజేసింది. స్విట్జర్లాండ్‌తో స్వయంచాలక సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈఓఐ) ప్రకారం పౌరులు, సంస్థల బ్యాంక్ ఖాతా వివరాలను భారత్ పొందింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆరెంజ్ క్యాప్.. పర్పుల్ క్యాప్ ఎవరికో తెలుసా..?
ఐపీఎల్ దాదాపు మిడ్-సీజన్ వరకు వచ్చినా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌లను ఇద్దరు ఆటగాళ్లే కొనసాగిస్తున్నారు. టోర్నీలో అత్యధికంగా 313 పరుగులతో కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్‌ను, 12 వికెట్లు పడగొట్టిన దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడా పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రాజమౌళి చిత్రాల్లో నటించాలని ఉంది'
ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్.. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించింది. ఆయన సినిమాల్లో నటించాలని ఉందంటూ తన కోరికను వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.