- ఆ జిల్లాలో భూమిలేని వారికి ఎకరం భూమి.. ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం జగన్
పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేయడానికి.. 6వేల కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేంద్రం నుంచి తీసుకునేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన 2,900కోట్లు సత్వరమే వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
- లంక గ్రామాలను హడలెత్తిస్తున్న గోదావరి.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
మహోగ్ర రూపం దాల్చిన గోదావరి తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని లంక గ్రామాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న లంక గ్రామాల్లో.. జనజీవనం స్తంభించింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
- 'వారికి.. ప్రభుత్వం ఉందనే నమ్మకం కల్పించండి'
వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు.. ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని కల్పించాలని చంద్రబాబు సూచించారు. పోలవరం ముంపు గ్రామాలతో పాటు.. లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదమరచి నిద్రపోతోందని ధ్వజమెత్తారు.
- PAWAN: 'రోడ్డు మధ్యలో గోతులు కాదు.. గోతుల మధ్యే రోడ్లు'
రాష్ట్రంలో గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవల్సి వస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రోడ్లు ఈత కొలనులను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రోడ్ల దుస్థితి తెలిపేలా #GoodMorningCMSir అని డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు పవన్ ప్రకటించారు.
- వరుణుడి ప్రతాపంతో ఆ రాష్ట్రాలు గజగజ.. 29 గ్రామాలు ఖాళీ!
భారీ వర్షాలు గుజరాత్, మహారాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు ఆయా రాష్ట్రాల ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాష్ట్రకు చెందిన 3000 మందిని అధికారులు.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు, గుజరాత్లో వరదల్లో చిక్కుకున్న 45 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి.
- భారత్‌లో మంకీపాక్స్ కలకలం.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
దేశంలో మరో వైరస్ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం విదేశాల నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి 'మంకీపాక్స్' సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అతడి రక్త నమూనాలను పుణె వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపగా.. పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు.
- బ్రిటన్ ప్రధాని రేసులో 'రిషి' దూకుడు.. రెండో రౌండ్లోనూ విజయం
బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న ఆ దేశ ఆర్థిక శాఖ మాజీ మంత్రి, భారత మూలాలున్న రిషి సునాక్ క్రమక్రమంగా పట్టు బిగిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవి కోసం గురువారం జరిగిన రెండో రౌండ్లోనూ ఆయన అత్యధికంగా 101 ఓట్లు గెలుచుకున్నారు. దాంతో పాటు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.
- క్రెడిట్ కార్డ్‌తో నష్టం కాదు లాభమే! ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు!!
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. కానీ చాలా మంది యూజర్లు.. క్రెడిట్ కార్డు వాడితే తమ తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతాయనుకుంటారు. కానీ అది నిజం కాదు!.. క్రెడిట్ కార్డును సరిగా వాడితే సంపదను సృష్టించుకునే అవకాశం ఉంది.
- విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే.. కోహ్లీ, బుమ్రా దూరం
విండీస్ పర్యటనకు టీమ్ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యుల బృందం గల ఈ జట్టులో విరాట్ కోహ్లీ, బుమ్రాలకు స్థానం దక్కలేదు. వారికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు బోర్డు పేర్కొంది.
- మెగాస్టార్ ఇంట్లో 'లాల్ సింగ్ చద్ధా' ప్రత్యేక ప్రివ్యూ.. హాజరైన టాలీవుడ్ ప్రముఖులు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్ధా' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖుల కోసం.. ఆమిర్‌ఖాన్ మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినిమా ప్రత్యేక ప్రివ్యూ వేశారు ఆమిర్‌ఖాన్.