- పులివెందులలో బయోటెక్ సైన్స్ ప్రారంభించిన జగన్
రెండురోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్ జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్.. పులివెందులలోని పశు పరిశోధన కేంద్రంలో బయోటెక్ సైన్స్‌ను ప్రారంభించారు.
- 292 ఉన్నత పాఠశాలలు అప్‌గ్రేడ్.. హైస్కూల్ ప్లస్‌గా మార్పు
రాష్ట్ర వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్లు స్పష్టం చేసింది. హైస్కూల్ ప్లస్ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది
- 'మా బడి.. మాకు కావాలి'.. పాఠశాల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు
ప్రాథమిక స్కూళ్లను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. సమీపంలోని స్కూళ్లను తీసేయడం వల్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు తమ పిల్లల్ని పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనివల్ల తమ పిల్లలు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- విద్యావ్యవస్థ సర్వనాశనం.. జగన్ సాధించిన ప్రగతి ఇదే : పట్టాభి
జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని తెదేపా నేత పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. 10వ తరగతిలోనూ 31 శాతం డ్రాపౌట్స్ ఉండడమే.. వైకాపా సర్కారు సాధించిన ప్రగతి అని ఎద్దేవా చేశారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం పిల్లల భవిష్యత్ ను తాకట్టు పెట్టారని మండి పడ్డారు.
- ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!.. శిందే గ్యాంగ్ దూకుడు!!
ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని చెప్పారు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్. బలపరీక్ష సమయంలో వారంతా విప్ ధిక్కరించారని ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని, వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో తెలిపారు.
- నిరాడంబరంగా సీఎం వివాహం.. మెరిసిపోయిన వధూవరులు
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం నిరాడంబరంగా జరిగింది. కొద్దిమంది అతిథుల సమక్షంలో డాక్టర్ గుర్ప్రీత్ కౌర్‌ను సీఎం మాన్ వివాహమాడారు. చంఢీగఢ్‌లో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
- బ్రిటన్ ప్రధాని బోరిస్ రాజీనామా.. ఎంతో బాధతో...
బ్రిటన్ రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు బోరిస్ జాన్సన్.
- 'పన్ను ఎగవేతకు 'వివో' పక్కా కుట్ర.. చైనాకు రూ.62వేల కోట్లు!'
మనీలాండరింగ్ కేసులో భాగంగా చైనా మొబైల్ తయారీ సంస్థ వివోపై ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ టర్నోవర్‌లో దాదాపు 50 శాతం ఇప్పటికే చైనాకు తరలించినట్లు ఈడీ గుర్తించింది.
- టీ20 వరల్డ్‌కప్‌కు ముందే భారత్- పాక్ ఢీ.. రివెంజ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌కు ముందు పొట్టి ఫార్మాట్లోనే ఆసియా కప్‌ను నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. అయితే గతేడాది పాక్ చేతిలో పరాజయం పాలైన భారత్.. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది.
- నాగ్ 'ది ఘోస్ట్' అదిరే అప్డేట్.. 'యువరాణి'గా త్రిష
నాగార్జున హీరోగా నటిస్తున్న 'ది ఘోస్ట్' చిత్రం ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని చిత్ర యూనిట్ ఖండించి టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. నాగ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. మరోవైపు, విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'లో త్రిష ఫస్ట్ లుక్‌ను గురువారం విడుదల చేశారు మేకర్స్.