ETV Bharat / city

ఏపీ ప్రధానవార్తలు@9am

author img

By

Published : Sep 6, 2022, 8:58 AM IST

.

9am topnews
ప్రధానవార్తలు9am
  • గ్రీన్‌ ఎనర్జీలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంది: సీఎం జగన్

రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ రంగంలో 81వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు పచ్చజెండా ఊపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఎస్​ఐపీబీ సమావేశంలో ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. గ్రీన్‌ ఎనర్జీలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. ఈ రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని రైతులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ పేరొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కళ తప్పిన.. వైఎస్ఆర్ జలకళ!

బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలుస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. నాలుగేళ్లలో 2 లక్షల బోర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయితే ప్రభుత్వం 2021-22 వరకు తవ్విన మొత్తం బోర్లు 6,555. వాటికి విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడానికి అయ్యే వ్యయాన్ని డిస్కంలు ప్రతిపాదిస్తే అంత మొత్తం భరించడం సాధ్యం కాదంటూ ఒక్కొక్క రైతుకు రూ.2 లక్షలనే ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నెల్లూరు జిల్లాలో దారుణం.. బాలికపై మేనమామ యాసిడ్​ దాడి

మేనమామ అంటే.. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన వాడు. భవిష్యత్​కు దారి చూపాల్సిన వాడు. కానీ కామం మత్తులో మేనకోడలిపైనే కన్నేశాడు. గత కొన్ని రోజులుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది ఎవరికీ చెప్పుకోలేక ఆమె కుమిలిపోయింది. దాంతో అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈరోజు అది శృతిమించి.. ఆమెపై యాసిడ్​ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు కోశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖలో డ్రగ్స్​ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్​ సరఫరా కొనసాగుతూనే ఉంది. పట్టణం నుంచి పల్లె వరకు డ్రగ్స్​ సప్లై చేసి.. యువతను మత్తుకు బానిసలను చేసి కోట్లు గడిస్తున్నారు. ఇలాంటి వాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఏదో ఒకచోట మత్తుమందులు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో భారీ స్థాయిలో డ్రగ్స్​ పట్టుబడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు సంపాదించిన మహిళ

కంటి నిండా నిద్ర పోవడం వల్ల రూ.5 లక్షలు సంపాదించింది ఓ మహిళ. బంగాల్​కు చెందిన త్రిపర్ణా చక్రవర్తి.. భారత తొలి స్లీప్ ఛాంపియన్​షిప్ టైటిల్​ను దక్కించుకుంది. అసలు నిద్రపోవడం వల్ల ఎందుకు ఇంత డబ్బులు వచ్చాయి? అన్ని డబ్బులు ఎవరు ఇచ్చారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బడిలో మత స్వేచ్ఛ ఉంటుందా?'.. హిజాబ్​ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న

ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే యూనిఫాం ధరించాలనే నిబంధన ఉండే పాఠశాలల్లోనూ హిజాబ్​ ధరించొచ్చా అనేది ఇక్కడ ప్రశ్న అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై జరిగిన వాదనల్లో పై వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదానికి కారణాలు అవే'.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ప్రముఖ పారిశ్రామిక వేత్త​ సైరస్​ మిస్త్రీ.. కారు రోడ్డు ప్రమాదానికి గురవ్వడానికి మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్ణయ లోపమే కారణమని పోలీసులు తెలిపారు. దుర్ఘటన జరిగే సమయంలో వెనుక సీట్లో ఉన్న మిస్త్రీ, జహంగీర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మన కార్లు ఎంత సురక్షితం?.. కొనే ముందు వాటిని చూస్తున్నామా?

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో మరోసారి వాహనాల భద్రతపై చర్చ మొదలైంది. ఇదివరకు కార్ల బడ్జెట్ గురించే ఆలోచించే వాహనదారుల ధోరణి ప్రస్తుతం మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు. 'ఎంతవరకు సురక్షితం' అనే అంశమూ బడ్జెట్‌ కార్ల కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోందని పేర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అర్ష్​దీప్​కు ఖలిస్థాన్​ ఉద్యమానికి లింకులు'.. కేంద్రం ఫైర్

ఖలిస్థాన్‌ ఉద్యమంతో క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు ముడిపెడుతూ వికీపీడియాలో సమాచారాన్ని ఉంచడంపై భారత ప్రభుత్వం మండిపడింది. ఈ తప్పుడు పోస్టుపై తక్షణం వివరణ ఇవ్వాల్సిందిగా వికీపీడియాను ఆదేశించింది. ఈ మేరకు ఆ సంస్థకు నోటీసులు పంపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ బడ్జెట్ చిత్రంలో నాగచైతన్య.. 'ఉగ్ర' రూపంలో అల్లరి నరేష్​

నాగచైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందనుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. కృతి శెట్టి కథానాయిక. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. ఇప్పుడు రెగ్యులర్‌ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కిస్తున్న చిత్రం 'ఉగ్రం'. 'నాంది' వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. మిర్నా మేనన్‌ కథానాయిక. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. సోమవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.