- 'ఆ భూ యజమానులపై తొందరపాటు చర్యలొద్దు'
ఆటోనగర్‌లలోని భూమి/ప్లాట్ల యజమానులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏపీఐఐసీ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు. అనంతరం విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- POLAVARAM: పోలవరం తొలి దశకు రూ.9,000 కోట్లు..అంచనాలు సిద్ధం చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిర్మాణానికి ఇంకా సుమారు 20 వేల కోట్ల రూపాయలు అవసరం కాగా.... తాజాగా కేంద్రం తొలి దశ పేరుతో కొత్త అంచనాలు రూపొందించింది. తొలి దశ కింద నిర్దేశించిన, మిగిలి ఉన్న పునరావాస పనులకు సుమారు 9వేల కోట్లు అవసరమని నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను ప్రాజెక్టు అథారిటీ పరిశీలనకు పంపినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విద్యాశాఖలో కొత్త పోస్టులు.. పదోన్నతులకూ మోక్షం ఎప్పుడో..!
నూతన విద్యా విధానంతో అనేక మందికి పదోన్నతులు వస్తాయని విద్యాశాఖ ప్రకటించింది. కొత్తగా ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టుల సృష్టిస్తామని ప్రకటన ఇచ్చింది. ఇప్పుడు వీటిపై ఎలాంటి కసరత్తు సాగడం లేదు. మరోవైపు 21వేల మంది ఎస్జీటీలకు పదోన్నతులు ఎప్పుడిస్తారోనని ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా... బాధితుడు రెండేళ్లు జైల్లోనే...
నెల్లూరుజిల్లాలోని ఓ అదనపు సెషన్స్ జడ్జిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను అలా అర్థం చేసుకోవడాన్ని బట్టిచూస్తే సదరు న్యాయాధికారికి జ్యుడిషియల్ అకాడమీలో ఎలాంటి శిక్షణ ఇచ్చారో అర్థం కావడంలేదన్నారు. ఆ పెద్దమనిషి ఎవరన్నది తాము తెలుసుకోవాలనుకుంటున్నామని జస్టిస్ యు.యు.లలిత్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 3 రోజుల్లో పెళ్లి.. శుభలేఖలు ఇస్తుండగా యువతిపై గ్యాంగ్‌రేప్- ఆ పార్టీ నేతకు లింక్!
తన పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్తుండగా.. ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఓ యువతి ఆరోపించింది. తర్వాత నిందితులు తనను ఓ రాజకీయ పార్టీ నేత దగ్గరకు తీసుకెళ్లారని, మరో వ్యక్తితో కొన్ని రోజులు ఉండేలా బలవంతం చేశారని ఫిర్యాదు చేసింది. యూపీ ఝాన్సీ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏసీ, ఫ్రిజ్, ఇంటర్నెట్.. తెగ వాడేస్తున్న భారతీయులు!
భారతదేశంలో విలాసవంతమైన వస్తువుల వినియోగం గత అయిదేళ్లలో బాగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం ఎక్కువగా పెరగకపోయినా ఇంటర్నెట్ మాత్రం భారీ పెరిగింది. ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ల వాడకంలో పెరుగదల కనిపించింది. ప్రస్తుతం ప్రతి ఒకరి చేతిలో మొబైల్ ఉండటం వల్ల గడియారం వాడకం బాగా తగ్గింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీలంకలో హింస.. రాజపక్స ఇంటికి నిప్పు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం
Srilanka Crisis: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో సోమవారం అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ప్రజలు, ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి మహీంద రాజపక్స వెనక్కితగ్గి.. తన పదవికి రాజీనామా చేశారు. నిరసన కారులు ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలపై విధ్వంసానికి దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రోజువారీ ఖర్చులు భారం.. 'బిట్‌కాయిన్' భారీ పతనం.. 6 నెలల్లో 50% డౌన్!
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజు రోజుకు దిగజారుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరింది. చివరకు 77.44 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల కారణంగా ఇప్పటికే వస్తువుల ధరలు భగ్గుమంటుంటే.. రూపాయి మారకపు విలువ క్షీణత వల్ల రోజువారీ ఖర్చులు మరింత పెరగనున్నాయి. సామాన్యులకు కూరగాయలు, నెలవారీ ఖర్చులు కూడా మరింత భారమవ్వనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tennis: ఆగయా నయా నాదల్.. దిగ్గజాలనే ఆటాడేసుకుంటున్నాడుగా
Madrid open Carlos alcaraz: చిన్నతనంలో ఆ పిల్లాడు చూసిన తొలి టెన్నిస్ టోర్నీ అది.. అప్పుడు దిగ్గజం నాదల్ టైటిల్ గెలిచాడు.. అది చూసి తన ఆరాధ్య ఆటగాడి లాగే ఆ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఆ పిల్లాడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు 19 ఏళ్ల వయసులో ఆ లక్ష్యాన్ని సాధించాడు. అది కూడా నాదల్, జకోవిచ్‌లపై నెగ్గి విజేతగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలయ్య 'అన్‌స్టాపబుల్' క్రేజ్.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
Unstoppable with NBK awards: 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' ఓ ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకమైన రెండు సిల్వర్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 9 AM