- Nirmala Sitaraman: నేడు అనంతపురం జిల్లాకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitaraman to visit AP: నేడు అనంతపురం జిల్లాకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనులకు భూమిపూజ చేయనున్నారు.
- దుష్ప్రచారాలన్నీ.. ఒక్క తీర్పుతో చెల్లు
అమరావతి కాదు భ్రమరావతి అంటూ ఎన్నో ఆరోపణలు. రాజధాని నిర్మాణానికి పనికిరాని ప్రదేశమంటూ... ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మరెన్నో అభాండాలు. అధికారంలోకి వచ్చిన తరువాత వైకాపా ప్రభుత్వం మూడేళ్లుగా చేసిన విమర్శలు అన్నీఇన్నీ కావు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతేనని హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో... అవన్నీ పటాపంచలయ్యాయి.
- TDP MLA cycle yatra: అసెంబ్లీకి ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర
TDP MLA cycle yatra: టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి అమరావతిలోని అసెంబ్లీకి.. సైకిల్‌పై వెళ్లారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించే వరకు తెదేపా తరఫున నిరంతర పోరాటం చేస్తామన్నారు.
- అదనపు ఏజీ జాస్తి నాగభూషణ్ రాజీనామా..!
AAG Jasti Nagabhushan Resignation: అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జాస్తి నాగభూషణ్ తన పదవికి శుక్రవారం రాజీనామా చేసినట్లు సమాచారం. అందుకు కారణాలు తెలియాల్సి ఉంది
- Chandrayaan: షార్కు చేరిన చంద్రయాన్ - 3 నమూనా
Chandrayaan: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్కు.. శుక్రవారం చంద్రయాన్-3కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ హోట్ టెస్ట్ మోడల్ (ఐహెచ్టీ) చేరింది.
- మణిపుర్ రెండో విడత పోలింగ్ షురూ.. బరిలో 92 మంది అభ్యర్థులు
Manipur assembly polls: మణిపుర్ రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. మొత్తం 22 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
- యుద్ధం వేళ.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కమలా హారిస్!
ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కీలక పర్యటన చేపట్టనున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులోని పోలండ్, రొమేనియాలకు వచ్చే వారం వెళ్లనున్నారు. రష్యా దురాక్రమణలకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కమలా హారిస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ తెలిపారు.
- ఆ ఒక్క 'ఐపీఓ' కోసమే.. కొత్తగా కోటి డీమ్యాట్ ఖాతాలు!
LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ ప్రతిపాదన తర్వాత కొత్తగా కోటి డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయని ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తుహిన్‌కాంత పాండే పేర్కొన్నారు. మదుపర్లకు మేలు చేసేలా మాత్రమే ఐపీఓ నిర్వహించాలన్నది తమ లక్ష్యం అని తెలిపారు.
- Shane Warne: షేన్‌వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ'
Shane warne news: స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ షేన్ వార్న్ పేరు వినగానే.. ఆయన సాధించిన ఎన్నో మైలురాళ్లు మనకు గుర్తొస్తాయి. ముఖ్యంగా వార్న్.. లెగ్‌స్టంప్‌కు ఆవల బంతి వేస్తూ ఆఫ్ స్టంప్‌ను ముద్దాడేలా స్పిన్ చేయడంలో దిట్ట. ఇంగ్లాండ్‌తో 1993 యాషెస్ సిరీస్‌లో జరిగిన ఆ అద్భుతాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..
- రామ్‌చరణ్‌తో రష్మిక.. విజయ్ దేవరకొండతో సమంత!
Tollywood new combinations: చిత్రసీమలో హీరో- హీరోయిన్ల కొత్త చిత్రాల సంగతులు, విషయాలు తరచూ బయటకొస్తుంటాయి. అందులో ఖరారైనవే కాకుండా.. పక్కా కావడానికి అటూ ఇటూగా ఉన్న కొన్ని కలయికల ముచ్చట్లు కూడా వినిపిస్తుంటాయి. అవి సినీప్రియుల్లో మరింత ఆసక్తిని పెంచుతాయి. ఆ తరహాలో వెలుగులోకి వచ్చిన కొన్ని కలయికల సంగతులను తెలుసుకుందాం..