- సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం: ఉద్యోగ సంఘాలు
ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వ చర్చలు ఫలించాయి. హెచ్‌ఆర్‌ఏ కొంతమేర పెంచేందుకు, సీసీఏ కొనసాగించేందుకు, అదనపు క్వాంటం పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచే (గతంతో పోలిస్తే కొంత తక్కువతో) అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దాంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఇది చీకటి ఒప్పందం.. ఆందోళన కొనసాగిస్తాం: ఏపీటీఎఫ్
చర్చల్లో సఫలమైంది ప్రభుత్వమేనని... తాము విఫలమయ్యామని ఏపీటీఎఫ్ నేతలు అన్నారు. ఇది చీకటి ఒప్పందమని... దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తమతో కలిసొచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- power problems in ap: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలు... ప్రభుత్వమే కారణం!
రాష్ట్రంలో మూడో రోజూ విద్యుత్ కోతలు తప్పలేదు.ఎన్‌టీపీసీ నుంచి సరఫరా ప్రారంభమైనా కోతలు అనివార్యమయ్యాయి. డిస్కంలకు సర్కారు రూ. 24 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల అవి అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు జెన్కో బిల్లులు చెల్లించలేని దుస్థితికి చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మాజీ ఐఏఎస్ పి.వి.రమేశ్ సోదరుడు రాజశేఖర్ జోషి ఇంటికి పోలీసులు
మాజీ ఐఏఎస్ పి.వి.రమేశ్ సోదరుడు రాజశేఖర్ జోషికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ క్రీస్తురాజపురంలోని రాజశేఖర్ జోషి ఇంటికి వెళ్లిన పోలీసులు..ఆయన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- PM Modi on Samatamurthy: 'జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం'
గద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. ఇక్కడ 108 దివ్య క్షేత్రాలను దర్శించుకున్నానని ప్రధాని తెలిపారు. దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగిందని ఆయన వివరించారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీకగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఒకప్పుడు గాంధీని హత్యచేసినవారే ఇప్పుడు నాపై దాడి చేశారు'
అప్పట్లో మహాత్మా గాంధీని చంపినవారే నేడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తనపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయని.. కానీ అల్లా నన్ను రక్షించాడని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కేరళలో భారీగా తగ్గిన కేసులు.. దిల్లీలో 3శాతం దిగువకు పాజిటివిటీ రేటు
కేరళలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 33,538 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ కారణంగా మరో 444 మంది మృతిచెందారు. అటు కర్ణాటకలో కొత్తగా 12,009 మందికి వైరస్ నిర్ధరణ అయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా యుద్ధ విమానాలు!
ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా సిద్ధమవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన మిత్రదేశమైన బెలారస్‌లో అణ్వాయుధ సామర్థ్యంగల రెండు టీయూ-22ఎం3 యుద్ధ విమానాలను రష్యా మోహరించడమే ఇందుకు కారణం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- U19 World Cup Final: కుర్రాళ్లు కుమ్మేశారు.. కప్ కొట్టేశారు
కుర్రాళ్లు పట్టు వదల్లేదు. దీటైన ప్రత్యర్థి ఎదురైనా తలొగ్గలేదు. ప్రపంచకప్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రోఫీయే లక్ష్యంగా అడుగులేస్తూ.. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థినీ దంచి కొడుతూ ముందంజ వేసిన యువ భారత్.. ఫైనల్లోనూ ప్రతాపం చూపింది. తనలాగే అజేయంగా ఫైనల్‌కు దూసుకొచ్చిన ఇంగ్లాండ్‌ను ఓడించి సిసలైన విజేత అనిపించుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'రాధేశ్యామ్' శాటిలైట్ హక్కులు రూ.250 కోట్లకు?
ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.250 కోట్లకు ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి