ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@9AM - ప్రధాన వార్తలు@9AM

ప్రధాన వార్తలు@9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు@9AM
author img

By

Published : Dec 24, 2021, 9:00 AM IST

  • TTD: జనవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

TTD Tickets: నేడు జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను తితిదే అధికారులు విడుదల చేయనున్నారు. ఉదయం 9 గం.కు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులో ఉంచుతారు.

  • High Court on Gudivada compost yard : 'గుడివాడ కంపోస్ట్ యార్డ్ ఏర్పాటుపై యథాతథ స్థితి పాటించండి'

గుడివాడలో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటుపై యథాతథ స్థితి పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జవనరి 24కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్​ కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

  • Raised raw silk Price: ముడి పట్టు రేట్లు పైపైకి.. నేతన్నలకు ఉక్కిరిబిక్కిరి

Raised raw silk Price: ఎన్నడూ లేనంతగా అమాంతం పెరిగిన ముడి పట్టు (యార్న్‌) ధరలు చేనేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడు నెలల క్రితం దాకా రూ.3-4 వేల మధ్య ఉన్న కిలో యార్న్‌ ధర వారం, వారం పెరుగుతూ రూ.6వేలకు చేరింది.

  • టీచర్​కు కరోనా- స్కూల్​ మూసేసిన అధికారులు!

Teacher tested positive for Covid: మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్​కు కొవిడ్​ సోకింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు స్కూల్​ను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

  • టీకా 'లక్కీ డ్రా'లో ఐఫోన్​-12.. కూలీ ఇంట్లో చిరునవ్వు!

ఓ లక్కీ డ్రాలో.. ఓ కూలీకి రూ.70వేలు విలువ చేసే ఐఫోన్​-12 వరించింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారు.. అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ నిర్వహించిన లక్కీ డ్రాలో పాల్గొనగా.. కిషన్​భాయ్​ అనే కూలీకి ఈ ఐఫోన్​ దక్కింది. ఇక ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

  • ఒమిక్రాన్​ను ఎదుర్కోవడంలో చైనా టీకా విఫలం.. బూస్టర్​తోనూ రక్షణ నిల్!

ఒమిక్రాన్ వేరియంట్​ వ్యాప్తి నేపథ్యంలో.. బూస్టర్​ డోసు పంపిణీపై దృష్టి పెట్టాయి వివిధ దేశాలు. అయితే.. చైనా అభివృద్ధి చేసిన సినోవాక్​ టీకా మూడు డోసుల్లో ఇచ్చినప్పటికీ ఒమిక్రాన్‌ను తటస్థీకరించేందుకు అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంలో విఫలమవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

  • వినియోగదారులకు షాక్​- పెరగనున్న ఆ వాహన ధరలు

Hero Motocorp News: ద్విచక్ర వాహన ధరలను పెంచింది ప్రముఖ సంస్థ హీరో మోటోకార్ప్‌. ఇన్‌పుట్‌ కాస్ట్‌ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

  • Ajaz Patel: చరిత్ర సృష్టించినా జట్టులో చోటు దక్కలేదు

Ajaz Patel: ఇటీవల భారత్​తో జరిగిన ఒక ఇన్నింగ్స్​లోనే పదికి పది వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు కివీస్​ ఆటగాడు అజాజ్​ పటేల్​. జట్టులో అతని స్థానానికి ఇంక ఢోకా లేదని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పదికి పది వికెట్లు తీసినా అజాజ్​కు​ బంగ్లాదేశ్​తో జరగనున్న టెస్ట్​ సిరీస్​లో చోటు దక్కలేదు.

  • Prabhas: 'ప్రభాస్ సినిమాల కోసం పార్లమెంట్​లో బడ్జెట్'

Prabhas: పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ సినిమాల కోసం పార్లమెంట్​లో బడ్జెట్​ కేటాయించాలని సరదాగా వ్యాఖ్యానించారు నటుడు నవీన్ పొలిశెట్టి. 'రాధేశ్యామ్' ప్రీరిలీజ్ ఈవెంట్​ సందర్భంగా ఆయన సందడి చేశారు.

  • 'మా బంధం ముగిసింది'.. బ్రేకప్‌పై మాజీ విశ్వసుందరి క్లారిటీ

Sushmita Sen: మోడల్ రోహ్మాన్​తో తన బంధం ముగిసిందని స్పష్టం చేశారు మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్. తమ మధ్య అనుబంధం ముగిసినా.. ప్రేమ అలానే ఉందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.