ETV Bharat / city

ప్రధానవార్తలు@9AM - ap top ten news

..

top news
ప్రధానవార్తలు
author img

By

Published : May 21, 2021, 9:03 AM IST

  • రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,29,779 కోట్లు.. సంక్షేమ పథకాలకు పెద్దపీట

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,29,779.27 కోట్ల అంచనా వ్యయంతో గురువారం బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభకు సమర్పించారు. తొలిసారిగా పిల్లల బడ్జెట్‌, మహిళల బడ్జెట్‌ పేరుతో విడిగా కేటాయింపులు చూపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అమూల్ అంటే అంత ప్రేమేంటి?'

ఏపీ డెయిరీ ఆస్తులు అమూల్‌కు కట్టబెడుతూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే.. ప్రభుత్వం ఆమూల్‌కు ఆస్తులు అప్పగిస్తూ జీవో జారీ చేశారు. దీనిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు అవకాశం కల్పిస్తూ.. విచారణను ఈనెల 27కు హైకోర్టు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్లాక్ ఫంగస్ చికిత్స: ఆసుపత్రుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం

బ్లాక్ ఫంగస్ కరోనా వారియర్స్​ను వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు బయటపడుతుండటం కలవరపెడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు..!

రానున్న 48గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 24న ఇవి మరింత తీవ్రమై తుపానుగా మారవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వారణాసి వైద్యులతో నేడు మోదీ సమీక్ష

వారణాసిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ నేడు మాట్లాడనున్నారు. ఆన్​లైన్ ద్వారా జరగనున్న ఈ సమీక్షలో.. వారణాసిలోని కొవిడ్​ ఆసుపత్రుల పనితీరు గురించి అడిగి తెలుసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశ సైనిక బలగాల్లో 90% మందికి టీకా

భారత త్రివిధ సైనిక దళాల్లోని సిబ్బందిలో 90శాతం మంది కొవిడ్​ టీకా రెండు డోసులు తీసుకున్నారు. 97 శాతం మంది టీకా మొదటి డోసు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా పుట్టుక లోగుట్టు ఏమిటి?

కరోనా పుట్టుకపై ఇటీవల 'ది ఆస్ట్రేలియన్‌' పత్రిక ప్రచురించిన కథనం.. వైరస్​ మూలాలపై మరోసారి చర్చకు దారితీసింది. వైరస్‌ను జీవాయుధంగా మార్చే అవకాశాలపై చైనా సైన్యానికి చెందిన శాస్త్రజ్ఞులు అయిదేళ్ల క్రితమే చర్చించారని ఆ పత్రిక పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే..

కరోనా ఏర్పరిచిన ఈ పరిస్థితుల్లో ఆర్థిక స్వేచ్ఛ సాధించడం ఎంతో కీలకం అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే తట్టుకొని నిలబడే శక్తి వస్తుందని పేర్కొన్నారు. అప్పులకు దూరంగా, వైవిధ్యమైన పెట్టుబడులతో ఇది సాధ్యం అవుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆస్ట్రేలియాతో కానిది.. టీమ్ఇండియా చేస్తోంది'

ఒకే సమయంలో రెండు వేర్వేరు దేశాల్లో సిరీస్​ల కోసం రెండు జాతీయ క్రికెట్ జట్లను పంపించనున్న తొలి దేశంగా భారత్ నిలవబోతోందని అన్నాడు పాక్ మాజీ సారథి ఇంజమాముల్ హక్. ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ దశలోనూ ఈ ఘనత సాధించలేకపోయిందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సినీ పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి'

ప్రస్తుతం చిత్రీసీమలో చాలా మార్పులొచ్చాయని అంటోంది నటి ప్రగ్యా జైస్వాల్. పెళ్లైన తర్వాత కూడా కొందరు కథానాయికలు కెరీర్​ పరంగా దూసుకెళ్తున్నారని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.