- నేడు సుప్రీంలో ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్.. నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మెజిస్ట్రేట్ ఉత్తర్వులనూ పట్టించుకోరా.. సీఐడీపై హైకోర్టు ఆగ్రహం
రమేశ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఎంపీ రఘురామను సీఐడీ అధికారులు జైలుకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీకాళహస్తిలో వెయ్యి పడకల కొవిడ్ తాత్కాలిక ఆసుపత్రి
నావల్ డాక్ యార్డ్ సాంకేతికత సహాయంతో శ్రీకాళహస్తి పరిధిలో వెయ్యి పడకలతో తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రిని ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- తౌక్టే ఎఫెక్ట్: రాష్ట్రంలో వర్షాలు.. అన్నదాతలకు నష్టాలు
తౌక్టే తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాలవర్షం అన్నదాతలను నష్టపరచగా... పొలాలు, కళ్లాల్లో ఎండబెట్టిన పంటను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం- భక్తులకు నో ఎంట్రీ
చార్దామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం నేడు తెరుచుకుంది. వేద మంత్రాలు, ప్రత్యేక పూజల నడుమ ఆలయ ద్వారాలను తెరిచారు పండితులు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మోదీ పర్యటనలో హింసకు కుట్ర- జమాత్ నేత అరెస్ట్
జమాత్ ఈ ఇస్లామి గ్రూప్ సీనియర్ నేత షాజహాన్ చౌధరిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత మార్చిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా చిట్టగాంగ్‌లో అల్లర్లకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు . పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ తొందరపాటు'
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణను తొందరపాటు చర్యగా చైనా అభివర్ణించింది. శాంతి ప్రక్రియ, ప్రాంతీయ సుస్థిరతకు ఇది విఘాతమని పేర్కొంది. ఐరాస తగిన పాత్ర పోషించాలని తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- నేటి నుంచే పసిడి బాండ్ల ఇష్యూ
నేటి నుంచి 2021-22 తొలి విడత సార్వభౌమ పసిడి బాండ్లు ఇష్యూకు రానున్నాయి. 21వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉండనున్నాయి. మే 25ను సెటిల్మెంట్ తేదీగా నిర్ణయించింది ఆర్థిక శాఖ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ టోర్నీ వాయిదా పడుతుందని ఊహించలేదు'
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నా ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు తెలిపింది ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు. ఈ సందర్భంగా ఈనాడుతో మాట్లాడిన ఆమె పలు విషయాలు పంచుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- తారల నోరు తీపి చేసిన పూజాహెగ్డే
నటి పూజాహెగ్డే.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు తారల నోరు తీపి చేసింది. వారందరికీ సహజ సిద్ధంగా పండించిన మామిడి పళ్లను పంపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.