ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - 9am top news today

ప్రధాన వార్తలు @ 9 AM

top news
ప్రధాన వార్తలు
author img

By

Published : May 16, 2021, 8:58 AM IST

  • రాష్ట్రంలో నేడు, రేపు వర్ష సూచన.. మోస్తరు వానలు కురిసే అవకాశం

రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రోజుకు 80 టన్నుల ఆక్సిజన్‌ ఇప్పించండి.. ప్రధానికి సీఎం జగన్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. కొవిడ్ కేసుల దృష్ట్యా జామ్‌నగర్‌ రిలయన్స్‌ ప్లాంట్‌ నుంచి రోజూ 80 టన్నుల ఆక్సిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎంపీ రఘురామ కేసులో రోజంతా హైడ్రామా.. గాయాలపై హైకోర్టు ఆగ్రహం

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో రోజంతా హైడ్రామా నడిచింది. పోలీసులు తనను కొట్టారని జడ్జికి రాతపూర్వకంగా ఎంపీ ఫిర్యాదు చేశారు. రబ్బరు బెల్టు, కర్రలతో కొట్టారని ఎంపీ తెలిపినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఏపీలో పాజిటివిటీ రేటు పెరగడం ఆందోళనకరం'

రాష్ట్రంలోని కొవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఏపీలో పాజిటివిటీ రేటు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారం వృద్ధిరేటు అత్యధికంగా 30% వరకు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిర్లక్ష్యం వల్లే కరోనా వ్యాప్తి: మోహన్ భగవత్న

కరోనా మహమ్మారి మొదటి దశ తర్వాత ప్రభుత్వం, ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందని ఆర్​ఎస్​ఎస్ అధినేత మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో పరస్పరం నిందించుకోవడానికి బదులు అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆ ఒప్పందాలు.. ఎవరో చెబితే కుదిరినవి కావు'

ఎవరో చెప్పడం వల్ల కొవాగ్జిన్ తయారు చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందాలు జరిగినట్లు వస్తున్న వార్తలను నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ కొట్టిపారేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'గాజాపై మరిన్ని రాకెట్లతో విరుచుకుపడతాం'

హమాస్​ ఉగ్రవాదులు చేస్తోన్న రాకెట్​ దాడులకు బదులుగానే తమ దేశం వైమానిక దాడులు చేసిందని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు తెలిపారు. వారం రోజులుగా పాలస్తీనా మిలిటెంట్లు తమపై క్షిపణుల వర్షం కురిపించారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెట్రో మోత.. మరోసారి ధరల పెంపు

దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. చమురు ధరలను పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్​పై 24పైసలు, లీటరు డీజిల్​పై 27పైసలను పెంచాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇటాలియన్​ ఓపెన్: ఫైనల్లోకి జకో.. రఫాతో అమీతుమీ

ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లోకి సెర్బియా టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ దూసుకెళ్లాడు. సెమీస్​లో లోరెంజో సోనెగోపై 6-3, 5-7 (2), 6-2తో గెలుపొందాడు జకో. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్​లో నాదల్​తో తలపడనున్నాడు జకోవిచ్​. ​పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాగ్​ దృష్టంతా 'బంగార్రాజు' పైనే

హీరో నాగార్జున.. లాక్​డౌన్ సమయాన్ని పూర్తిగా 'బంగార్రాజు' సినిమా కోసమే కేటాయిస్తున్నారని తెలిసింది. కథా చర్చల్లో పాల్గొంటూ స్క్రిప్టును పక్కా చేసే ప్రయత్నాల్లో ఉంటున్నారట. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.