దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ నుంచి ఏపీలోని పలుచోట్లకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు ఈనెల 27 నుంచి వచ్చేనెల 7 వరకు ప్రయాణికులకు సేవలను అందించనున్నాయి. ఈ మేరకు ఏపీలోని పలు ప్రాంతాలకు 964 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక బస్సులలో ఒకటిన్నర రెట్లు అధిక చార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని సీబీఎస్, ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్లో మే ఐ హెల్ప్ యూ కౌంటర్ల ద్వారా ప్రయాణికులకు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం కల్పించామన్నారు.
ప్రత్యేక బస్సులు వెళ్లే స్థలాలు
తెలంగాణ (హైదరాబాద్) నుంచి విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు మాచర్ల , గుడివాడ, రాజమండ్రి కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖ, శ్రీకాకుళం, భీమవరం, నరసాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామురు, పొదిలి, కర్నూలు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లెకి ప్రత్యేక బస్సులను నడపనున్నారు..
ఇదీచదవండి