ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 920 కరోనా పాజిటివ్ కేసులు - corona cases in telangana

రెండు తెలుగు రాష్ట్రాల్ల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో గురువారం 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది మృతి చెందగా... మొత్తం మరణాల సంఖ్య 230కి చేరింది.

telanagana corona cases
తెలంగాణలో మరో 920 కరోనా కేసులు, 5 మరణాలు
author img

By

Published : Jun 26, 2020, 6:33 AM IST

తెలంగాణలో గురువారం 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 3,616 నమూనాలను పరీక్షించగా.. 920 మందికి వైరస్​ సోకినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 11,364కి చేరింది.

కరోనాతో గురువారం మరో 5 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య 230కి చేరింది. తాజాగా 327 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,688 మంది డిశ్చార్జి అయ్యారు.

తాజాగా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 737 నమోదయ్యాయి. రంగారెడ్డిలో 86, మేడ్చల్​లో 60, కరీంనగర్​లో 13 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మొత్తం 18 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: నెహ్రూ జూపార్క్​లో తెల్లపులి మృతి.. సీసీఎంబీకి రిపోర్టు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.