- పూడిమడక తీరంలో గల్లంతైన మరో రెండు మృతదేహాలు లభ్యం.. కొనసాగుతున్న గాలింపు
పూడిమడక తీరంలో గల్లంతైన వారిలో మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.
- ఆలయ భూమి అప్పగింతకు చౌక బేరం.. ఈ ధరతోనే ప్రత్యామ్నాయం..!
Temple land: ఆలయ భూమి అప్పగింతకు చౌక బేరం సాగుతోంది. మార్కెట్ విలువ ఎకరా రూ.కోటి ఉంటే.. అధికారులు వేసింది రూ.3.30 లక్షలే. ఆక్రమణదారులకు మేలు చేసేందుకు వీలుగా.. అధికారులు ఆ ఆలయానికి ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇది సీఎం సొంత నియోజకవర్గంలో జరుగుతున్న తంతు.
- Bar license: దరఖాస్తుదారులు ఎందుకు వెనక్కి తగ్గారు?
Bar license: బార్ల లైసెన్సుల దరఖాస్తుదారుల్లో 514 మంది వెనకడుగు వేశారు. క్సైజ్‌శాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా.. తొలుత 1,672 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన గడువు ముగిసే నాటికి 514 మంది వెనక్కి తగ్గారు. ఒత్తిళ్లే దీనికి కారణమని మద్యం వ్యాపారుల్లో చర్చ సాగుతోంది.
- గుంటూరులో మంకీఫాక్స్ అనుమానిత కేసు
రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడ్ని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు.
- బలమైన ప్రభుత్వమంటే నియంత్రించడం కాదు: మోదీ
PM MODI CHENNAI VISIT: యువత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం 42వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తమ హయాంలోని బలమైన ప్రభుత్వం దేన్నీ నియంత్రించదని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ప్రతి దేశంపైనా పడిందని.. భారత్ దాన్నుంచి బయటపడేందుకు శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రజలు తోడ్పడ్డారని తెలిపారు.
- జస్టిస్ ఖాన్విల్కర్ కష్టపడేతత్వానికి మారుపేరు: సీజేఐ
కష్టపడేతత్వానికి మారుపేరు జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా మూడో స్థానంలో ఉన్న జస్టిస్ ఖాన్విల్కర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
- భక్తుడికి బంపర్ ఆఫర్.. ప్రసాదం కోసం వెళ్తే చేతిలో రూ.లక్షలు!
కర్ణాటక చామరాజనగర్‌లో ఓ అధికారి తప్పిదం తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారి ప్రసాదానికి బదులుగా పొరపాటున రూ.2.91లక్షలు ఉన్న బ్యాగును ఇచ్చాడు.
- 'రిషి'ని ఇబ్బందిపెట్టేలా పార్టీ ఓటర్ల ప్రశ్నలు.. 'వెన్నుపోటు పొడిచారంటూ'!
UK pm race: బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్, లిజ్ ట్రస్లు పార్టీ ఓటర్ల ఆదరణను చూరగొనడానికి నడుం బిగించారు. ఓటర్లతో మమేకమయ్యేందుకు కన్జర్వేటివ్ ప్రచార కార్యాలయం వీరివురితో గురువారం ఓ ముఖాముఖిని నిర్వహించింది. ఈ ముఖాముఖిలో పార్టీ ఓటర్లు సునాక్, ట్రస్‌ల విధానాలపై గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేశారు.
- 'కామన్వెల్త్' తొలిరోజు మెరుగ్గానే.. టీటీ, బ్యాడ్మింటన్‌లో భారత్ శుభారంభం
Commonwealth Games: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలను భారత్ మెరుగ్గా మొదలెట్టింది. తొలి రోజు పతకం సాధించలేకపోయినా.. వివిధ క్రీడల్లో మన అథ్లెట్లు సత్తాచాటారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీలో శుభారంభమే దక్కింది. మరోవైపు ఈ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన అమ్మాయిల క్రికెట్లో టీమ్ఇండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు.
- రణ్‌బీర్ సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Fire Accident At Ranbir Film Set: బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఓ సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM
..
ప్రధాన వార్తలు @ 9 AM

TAGGED:
9am