- నన్నలా అంటే.. సీఎం జగన్‌ను ఇలా అంటాం: పవన్
ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ అన్నారు. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనే 'కౌలురైతు భరోసా యాత్ర' చేపట్టామని తెలిపారు. వైకాపా నేతలపై తనపై చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'నన్ను సీబీఎన్ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటాం' అని బదులిచ్చారు.
- అవసరమైతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తాం: సీపీఐ నేత రామకృష్ణ
CPI Dharna: అధిక ధరలకు వ్యతిరేకంగా రేపు సచివాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యులు బతికే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- సీఎం సభలో భద్రతా వైఫల్యం.. స్టేజీకి దగ్గరగా బాణసంచా పేలుడు
Nitish kumar news: బిహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరైన ఓ సభలో బాణసంచా ఆయనకు అతి దగ్గరగా పేలింది. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ శబ్దం విని ప్రజలు పరుగులు తీశారు.
- విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలకు అనుమతి
UGC Dual Degrees: ఏకకాలంలో రెండు డిగ్రీలను కొనసాగించడానికి విద్యార్థులకు యుజీసీ అనుమతినిచ్చింది. ఈ మేరకు యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ మంగళవారం ప్రకటించారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) త్వరలో వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేయనుందని తెలిపారు.
- రాత్రివేళ హెడ్లైట్లు లేకుండానే బస్సు నడిపిన డ్రైవర్.. ప్రయాణికులు హడల్
Bus Driving Without Headlights: దక్షిణ కన్నడ జిల్లాలో ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. హెడ్లైట్లు లేని బస్సును చీకట్లో నడిపాడు. కుక్కే సుబ్రహ్మణ్య ఎక్స్‌ప్రెస్ ఉప్పినంగడి నుంచి రాత్రి 7.15కు బస్సు బయలుదేరింది. బస్సుకు ఉన్న నాలుగు లైట్లు అప్పటికే పాడయ్యాయి. అయినప్పటికీ రాత్రి సమయంలోనూ డ్రైవర్ అలాగే బస్సును నడిపాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఓ ప్యాసింజర్ దీనిని వీడియో తీస్తుండగా.. కండక్టర్ అప్రమత్తమై ఓ లైట్‌ను ఫిక్స్ చేయించాడు. డ్రైవర్ తీరుపై ఆగ్రహించిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- 'ధోనీ అలా చేసేసరికి.. పట్టరాని కోపంతో అరిచేశాను'
MS Dhoni Ravi Shastri: టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీపై ఓ సందర్భంలో పట్టరాని కోపంతో అరిచేశాడట మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి. ప్రస్తుత ఐపీఎల్లో కామెంట్రీ చేస్తున్న శాస్త్రీ.. ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించాడు. అందుకు ధోనీకి ఫుట్‌బాల్‌పై ఉన్న మక్కువే కారణమట. ఇంతకీ ఏమైందంటే?
- చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ఐపీఎల్ నుంచి అతడు ఔట్!
IPL 2022: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది! ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆ జట్టు.. తొలి విజయం సహా గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ దీపక్ చాహర్ కోసం నిరీక్షిస్తోంది. అయితే ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడం వల్ల ఈ సీజన్ మొత్తానికి అతడు దూరమవుతాడని తెలుస్తోంది.
- 'ఆచార్య' ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్లలో మెగా అభిమానుల రచ్చ
Acharya Trailer: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ట్రైలర్ వచ్చేసింది. తొలుత ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేయగా.. అభిమానులు పండగ చేసుకున్నారు. యూట్యూబ్‌లోనూ వచ్చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
- కేజీయఫ్‌కు వచ్చిన డబ్బులన్నీ వాళ్లకే ఇస్తా: ప్రశాంత్‌నీల్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన 'కేజీఎఫ్ చాప్టర్-2'. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. కొలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంగా సాగే యాక్షన్ డ్రామాతో కేజీఎఫ్ కు కొనసాగింపుగా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనాఠండన్ సహా తెలుగు, కన్నడ నటులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు ప్రశాంత్, కథానాయకుడు యశ్ వెల్లడించారు. ముఖ్యంగా తన రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు ప్రశాంత్ నిల్.