- YSR Pensions: పలు జిల్లాల్లో.. లబ్ధిదారులకు పింఛన్ అందించిన మంత్రులు
YSR Pensions Distribution: రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం ముఖ్యమంత్రి జగన్ పాటుపడుతున్నారని మంత్రులు అన్నారు. పెరిగిన పింఛన్‌ను పలు జిల్లాల్లో లబ్ధిదారులకు మంత్రులు, ఎంపీలు అందజేశారు.
- వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు.. రెక్కీ ఘటనపై ఆరా
తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. వంగవీటి రాధా ఇంటికి వెళ్లారు. రాధా హత్యకు జరిగిన రెక్కీ ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. వ్యక్తిగత భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని చంద్రబాబు అభయ మిచ్చారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని చెప్పారు.
- WOMAN HULCHAL : మద్యం మత్తులో యువతి హల్చల్.. పోలీసు చొక్కా పట్టుకుని వీరంగం
Woman behaved rudely with police: నూతన సంవత్సర వేడుకల్లో తప్పతాగిన ఓ యువతి.. నడిరోడ్డుపై హల్చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రెవ్ టెస్టులో నానా హైరానా సృష్టించింది. బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయకుండా పోలీసులను అడ్డుకుని.. వారి చొక్కా పట్టుకుని వీరంగం వేసింది. తానెవరో హైదరాబాద్ పోలీసులకు తెలిసేలా చేస్తానని హెచ్చరించింది.
- ఒక్కరోజులో 6 వేల సంస్థలకు విదేశీ విరాళాలు కట్!
FCRA registration expired: దేశంలోని ఆరు వేల సంస్థల ఎఫ్ఆర్సీఏ లైసెన్సు ముగిసింది. దిల్లీ ఐఐటీ, జామియా మిలియా ఇస్లామియా విద్యాసంస్థలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నెహ్రూ మ్యూజియం లైసెన్సు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు పొందేందుకు ఎఫ్ఆర్సీఏ లైసెన్సు వీలు కల్పిస్తోంది.
- వెయ్యేళ్ల నాటి శివలింగం స్వాధీనం- విలువ రూ.500 కోట్లు!
500 crore Emerald Lingam: వెయ్యేళ్ల నాటి అరుదైన శివలింగాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తంజావూరులో ఈ శివలింగం బయటపడింది. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.
- ఆలయంలో పూజలు చేస్తూ జవాన్ల న్యూఇయర్ వేడుకలు
BSF Soldiers harti: గుడిలో పూజలు చేస్తూ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. గుజరాత్ కచ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద మోహరించిన జవాన్లు.. స్థానిక మందిరంలో హారతి కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, కరోనా మహమ్మారి బెడద తొలగిపోవాలని ప్రార్థనలు చేశారు.
- ITRs For FY21: ఐటీ రిటర్నులు దాఖలు చేసిన 5.89 కోట్ల మంది
ITRs For FY21: డిసెంబరు 31 నాటికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నలు(ఐటీఆర్) ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో సకాలంలో ఐటీఆర్‌లు దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కృతజ్ఞతలు తెలిపింది.
- దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. టీమ్ఇండియా తుదిజట్టిదే!
IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టు కోసం సిద్ధమవుతోంది టీమ్ఇండియా. ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ కోసం తుదిజట్టులో ఎవరికి అవకాశం దక్కే వీలుందో చూద్దాం.
- కొడుకుపైనా దయ చూపని బ్రెట్‌లీ.. క్లీన్‌బౌల్డ్ చేసి!
Brett Lee News: మేటి బ్యాటర్లపై ఫాస్ట్ బాల్స్‌తో విరుచుకుపడిన మాజీ స్టార్ బౌలర్ బ్రెట్‌లీ. ఆటకు దశాబ్దం కిందటే వీడ్కోలు పలికిన అతడు మరోసారి బంతి చేతబట్టాడు. ఈ సారి నిర్దయగా తన కుమారుడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు.
- 'ఆర్ఆర్ఆర్' సినిమా మళ్లీ వాయిదా
RRR postponed: ఇప్పటికే చాలాసార్లు వాయిదాపడిన 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ మరోసారి మారింది. జనవరి 7న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం లేదని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. తనపై ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.