- AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 2,068 కరోనా కేసులు, 22 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2,068 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 80,641 మంది నమూనాలు పరీక్షించగా 2,068 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2,127 మంది కోలుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Venkaiah naidu: 'బయోటెక్నాలజీ హబ్‌గా.. హైదరాబాద్'
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice president Venkaiah Naidu) భారత్ బయోటెక్‌ను సందర్శించారు. భారత్ బయోటెక్(Bharat biotech) మనదేశానికి చెందినది కావడం గర్వకారణమని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. మన శాస్త్రవేత్తలు అనేక దేశాల ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని ప్రశంసించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- CM jagan: 'పురపాలిక, నగరపాలికల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి'
పురపాలిక, నగరపాలికల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్.. ఆర్‌అండ్‌బీ శాఖతో కలిసి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. వర్షాకాలం ముగియగానే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాష్ట్రానికి మరో 4.68 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు
పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి రాష్ట్రానికి మరో 4.68 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో నెలకొన్న కొవిడ్ టీకాల కొరత తీరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'కేసీఆర్ ఫాంహౌస్, ప్రగతి భవన్ పేదలకు పంచుతాం..'
2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్ మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మళ్లీ కొవిడ్ విజృంభణ.. రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు!
కొద్దివారాలుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన కొవిడ్ మహమ్మారి.. మరోమారు విజృంభిస్తోంది. వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఉన్న ఆంక్షలను కఠినతరం చేయడం సహా కొత్త నిబంధనలను విధిస్తున్నాయి. కర్ణాటకకు వచ్చేవారికి నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర సర్కారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 2023లో పీజీ వైద్య కోర్సులకు ప్రవేశ పరీక్ష!
2023 ప్రథమార్థంలో వైద్య విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను(ఎన్ఈఎక్స్టీ) నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆ రెండు టీకాలు కలిపి ఇస్తే కరోనా నుంచి రక్ష!'
ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్-వి టీకాల సమ్మేళనం ఎలాంటి దుష్ప్రభావాలు చూపలేదని రష్యా సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) ప్రకటించింది. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకకుండా అడ్డుకోవడంలో, అలాగే తీవ్రస్థాయి కొవిడ్ బాధితుల ప్రాణాలను నిలబెట్టడంలో ఈ మిశ్రమం మెరుగ్గా పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రాథమిక ఫలితాల్లో వెల్లడైనట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎక్స్‌క్లూజివ్: 'ఎన్నో త్యాగాలు.. కఠోర శ్రమతోనే పతకం'
ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుతో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్బంగా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్న చాను.. పతక వేటలో ఎన్నో త్యాగాలు చేసినట్లు వివరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'థియేటర్ అనుభూతి మాటల్లో చెప్పలేం'
సత్యదేవ్, ప్రియాంక జావల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'తిమ్మరుసు'. శుక్రవారం నుంచి థియేటర్లు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన సత్యదేవ్.. తన అనుభూతిని 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి