ETV Bharat / city

ప్రధానవార్తలు@7PM - ఆంధ్రప్రదేశ్ వార్తలు

.

7pm topnews
ప్రధానవార్తలు@7PM
author img

By

Published : Jul 19, 2020, 7:06 PM IST

  • 5 గంటలుగా రహదారిపైనే మృతదేహం..!

కరోనా మరణాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. బతికున్నంత వరకే మనుషుల మధ్య బంధాలు, ఆప్యాయతలు ఉంటాయా.. అన్న రీతిలో సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు మానవత్వపు ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు ఆ నలుగురు లేక.. అందరూ ఉన్నా.. భయంతో ఎవరూ ముందుకు రాక.. వారి మృతదేహాలు దిక్కులేని శవాల్లా రహదారిపై దర్శనమిస్తున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • లోకేశ్‌ దాతృత్వం

మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని పాత్రికేయులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బీమాతో దీమా కల్పించారు. 62 మంది పాత్రికేయులకు బీమా చేయించారు. కొవిడ్ మ‌ర‌ణాల‌కూ బీమా వ‌ర్తించేలా ప్రీమియం చెల్లించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'బుగ్గనకు అలవాటే'

వైకాపా నాయకుల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి స్పష్టం చేశారు. అంబులెన్స్‌ల పేరుతో వైకాపా ప్రభుత్వం దోచుకున్నది వాస్తవమేనని దుయ్యబట్టారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఇప్పుడు మీరేం చేస్తున్నారు?

వర్షాకాలం వస్తుందన్న రెండు నెలల ముందే గత తెదేపా ప్రభుత్వం అంటువ్యాధులు ప్రభలకుండా చర్యలు చేపట్టేదని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. కానీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 6 కోట్లకు చేరిన ఫాలోవర్స్​

ట్విట్టర్​లో ప్రధాని నరేంద్ర మోదీ ఫాలోవర్స్ సంఖ్య ఆరు కోట్లకు చేరింది. ముఖ్యమైన సందేశాలను ప్రజలతో పంచుకోవడానికి ట్విట్టర్​ను విస్తృతంగా ఉపయోగిస్తారు మోదీ. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • నల్ల చిరుత ఫొటో వెనుక ఉంది అతనే

భారీ చెట్లు.. వాటిని ఆవరించిన పొగమంచు.. దాన్ని చీల్చుకొస్తున్న సూర్యకిరణాల్లో నల్లగా నిగనిగలాడుతూ ఠీవిగా నడిచి వెళ్తున్న ఓ చిరుత! ఆకు చాటు నుంచీ, చెట్టు మరుగు నుంచీ భయంగొలిపే కళ్లతో చూస్తూ దాగుడుమూతలాడుతున్నట్లు మళ్లీ అదే నల్ల చిరుత! ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ ఫొటోల వెనుక ఓ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఐదేళ్ల కష్టం ఉంది. కార్పొరేట్‌ ఉద్యోగాన్ని కాలదన్ని, తన అభిరుచి కోసం అడవి బాట పట్టిన తెగువుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రయాణానికి ఏడాది!

భారీ యంత్రంతో బయలు దేరిన ఓ ట్రక్కు మహారాష్ట్ర నుంచి కేరళ తిరువనంతపురానికి చేరుకుంది. మొత్తం నాలుగు రాష్ట్రాలను దాటుకుంటూ నగరానికి చేరుకోవటానికి ఏడాది సమయం పట్టినట్లు సంబంధిత సిబ్బంది తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వీడని సస్పెన్స్

నేపాల్​లో అధికార కమ్యూనిస్టు​ పార్టీ స్టాండింగ్​ కమిటీ సమావేశం మరోమారు వాయిదా పడింది. ప్రధాని ఓలి- పార్టీ కో చైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ ప్రచండ మధ్య సయోధ్య కుదిర్చేందుకే సమావేశాన్ని వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 11గంటలకు ఈ స్టాండింగ్​ కమిటీ సమావేశం ఉంటుందని పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • విజేతగా హరికృష్ణ​

బీల్​ ఫెస్టివల్​ చెస్​ 960 టోర్నమెంట్​లో భారత గ్రాండ్​ మాస్టర్​ పి.హరికృష్ణ విజేతగా నిలిచాడు. టోర్నీలో జరిగిన ఏడు రౌండ్లలో 5.5 పాయింట్లు నమోదు చేసి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • భామ​ వరల్డ్​ రికార్డు గురించి విన్నారా?

రెబల్​ స్టార్​ ప్రభాస్​- నాగ్​ అశ్విన్​ కాంబినేషన్​లో తెరకెక్కనున్న చిత్రంలో దీపికా పదుకొణె నటించనున్నట్లు ఖరారైంది. తాజాగా ఇందుకు సంబంధించి ప్రకటన కూడా చేసింది చిత్రబృందం. అయితే, ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?. బాలీవుడ్​లోనే అత్యధికంగా సంపాదిస్తున్న నటిగా గిన్నిస్​ వరల్డ్​ రికార్డుతో చరిత్ర సృష్టించిందీ నటి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.