- రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు, 104 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌కు మరో 104 మంది బలయ్యారు. కరోనా నుంచి మరో 20,109 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రాణం విలువ తెలిసిన వారెవ్వరూ స్పందించకుండా ఉండరు: లోకేశ్
సీఎం జగన్‌పై తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ మరోసారి ట్విటర్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు ప్రాణం విలువ తెలిసిన వారెవ్వరూ స్పందించకుండా ఉండరని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రఘురామ కేసును సీబీఐతో విచారణ చేయించాలి: విష్టుకుమార్ రాజు
రఘురామను అరెస్టు చేసి భౌతిక దాడికి పాల్పడడంపై సీబీఐతో విచారణ చేయించాలని భాజపా నేత విష్టుకుమార్ రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న కక్షపూరిత దాడులను ఆయన ఖండించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం త్వరగా స్పందించాలి'
కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని..ప్రజలకు ఉపయోగకరం అయితే అందుబాటులోకి తేవాలని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య సూచించారు. విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం X సిద్ధూ: సంక్షోభంలోకి పంజాబ్ కాంగ్రెస్!
పంజాబ్.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య వివాదం తారస్థాయికి చేరటం.. కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత, భవిష్యత్తే ముఖ్యం'
సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు, ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది కేంద్ర విద్యాశాఖ. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీకీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లైవ్ వీడియో: బద్ధలైన అగ్నిపర్వతం
ఇటలీ సిసిలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడుతోంది. ఆకాశాన్నంటేలా భీకరంగా నిప్పులు చిమ్ముతోంది ఎట్నా. ఎర్రటి జ్వాలతో భయంగొల్పే రీతిలో కనిపిస్తోంది. మౌంట్ ఎట్నా ఐరోపాలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ కంపెనీల నిమిషం సంపాదన ఎంతో తెలుసా?
యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్.. వంటి దిగ్గజాలు టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. గూగుల్, ఫేస్బుక్, టెస్లా వంటి కంపెనీలు కూడా తమ రంగాల్లో దిగ్గజాలుగా వెలుగొందుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చిరిగిన బూట్లతో ఆడుతున్నాం.. స్పాన్సర్లు ఉంటే బాగుండు'
జింబాబ్వే క్రికెటర్ ర్యాన్ బర్ల్ ట్విట్టర్లో పెట్టిన ఓ ఫొటో ఆ దేశ బోర్డు పరిస్థితిని కళ్లకు కడుతోంది. చిరిగిన బూట్లను పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రముఖ నేపథ్య గాయకుడు ఏవీఎన్ మూర్తి మృతి
టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు ఎ.వి.ఎన్ మూర్తి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.