- తగ్గని విలయం
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,393 మందికి పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 3,25,396కు చేరింది. వైరస్ బారిన పడి మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మహిళల జీవితాన్ని మార్చేందుకే'
వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళా సాధికారితకు మరో 2 సంస్థలు తోడ్పాటు అందించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్ రిటైల్ జియో, అల్లాన కంపెనీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ప్రాజెక్టులు నిలుపుదల చేయాలి'
కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని.. వాటిని నిలుపుదల చేసి.. ఏపీ రైతుల హక్కులు కాపాడాలని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి షెకావత్‌కు.. సమాఖ్య అధ్యక్షుడు ఈ - మెయిల్ ద్వారా లేఖ పంపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అనుమతి లేదు'
కరోనా కేసుల దృష్ట్యా విజయవాడ నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి లేదని నగర సీపీ తెలిపారు. ఎవరి ఇళ్లల్లో వారే పూజలు చేసుకోవాలని సూచించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రికార్డు స్థాయిలో ...
దేశంలో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 9.18 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. మొత్తంగా ఇప్పటివరకు 3.26 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసం'
ఆరేళ్లుగా అసంఘటిత ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రైతులు, కూలీలు, చిన్న స్థాయి వ్యాపారులను పట్టించుకోకుండా.. ఎంతో కీలకమైన అసంఘటిత రంగాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అది ట్రంప్ వల్లకాని విషయం'
అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏమీ చేయలేకపోయారని.. ఎందుకంటే అది ఆయన వల్లకాని విషయమని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శించారు. ట్రంప్ చేసిన నష్టం నుంచి అమెరికన్లను బయటపడేయగలిగేది.. జో బైడెన్ మాత్రమేనని ఓటర్లకు సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రెస్టారెంట్లు శాశ్వతంగా మూత!
కొవిడ్‌తో కుదేలైన రెస్టారెంట్ల వ్యాపారాలు.. కరోనా ముందున్న స్థాయికి చేరేందుకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. కరోనా సంక్షోభంతో ఇప్పటికే 10 శాతం రెస్టారెంట్లు శాశ్వతంగా ముతపడ్డాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సఫారీ జట్టులో కరోనా కలకలం
కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం కుదేలైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ టోర్నీలు మొదలవుతున్న తరుణంలో ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'నాగలి'కి భారీ స్పందన
రైతు కష్టాలపై 'నాగలి' అనే వీడియో పాటను రూపొందించాడు ర్యాపర్ రోల్ రైడా. రైతన్నల పట్ల నేటి తరానికున్న అభిప్రాయాలను మార్చాలనే ఉద్దేశంతో ఈ పాటను తెరకెక్కించినట్లు చెప్పాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.