ETV Bharat / city

ప్రధానవార్తలు7am - 7ఏఎం టాప్​ న్యూస్​

.

7am topnews
ప్రధానవార్తలు7am
author img

By

Published : Aug 13, 2022, 6:59 AM IST

  • అనుమతులు లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్‌ పరిధిలో పట్టణ ప్రణాళిక అధికారుల అండతో ఓ వ్యక్తి ప్లానుకు విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మించాడు. జీ ప్లస్​ త్రీకి అనుమతులు తీసుకోగా, ఇప్పుడక్కడ జీ ప్లస్​ ఫోర్​ భవనం కన్పిస్తోంది.తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధిలో ఒకరు నిర్మించిన భవనానికి నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌, పార్కింగ్‌ స్థలం విడిచిపెట్టలేదు. భవన నిర్మాణ సమయంలో పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ.. చూడనట్లుగా వదిలేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్ సునీత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత ..సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఆమె పిటిషన్‌లో వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తితిదేలో అక్రమాలకు పాల్పడుతున్న సూపరింటెండెంట్‌ సహా ఆరుగురు అరెస్ట్​

తిరుమల తిరుపతి దేవస్థానం సూపరింటెండెంట్‌ సహా ఆరుగురు దళారులను తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో దర్శన టికెట్లు ఇప్పించడంలో అక్రమాలు గుర్తించిన తితిదే విజిలెన్స్ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు రావడంతో విశాఖలోని తితిదే హెచ్‌డీపీపీ విభాగంలో పనిచేస్తున్న మల్లికార్జునను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎంపీ గోరంట్ల వ్యవహారాన్ని గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లిన మహిళా నేతలు

ఎంపీ గోరంట్ల వీడియో వ్యవహారంపై అఖిలపక్షాల మహిళా నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటివరకు అనేక రూపాల్లో ఆందోళనలు చేసిన మహిళా నేతలు ఈరోజు గవర్నర్​ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. త్వరలోనే దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, లోక్​సభ స్పీకర్​ను కలుస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నాలుగు కేంద్ర మంత్రి పదవులు అడిగితే.. భాజపా అప్పుడు ఒప్పుకోలేదు'

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. భాజపాపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో నాలుగు కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలన్న తన డిమాండ్‌ను భాజపా తిరస్కరించినప్పుడే ఇక తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్టు నితీశ్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 40 అంతస్తుల ట్విన్​ టవర్స్​ కూల్చివేత ఆలస్యం.. కారణమిదే

నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్​ కూల్చివేత తేదీని సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 21వ తేదీన ఉన్న డెడ్‌లైన్‌ను ఆగస్టు 28 వరకు పెంచింది. సాంకేతికత, వాతావరణ పరిస్థితుల కారణంగానే కూల్చివేత తేదీని పొడిగించినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి.. స్టేజిపైనే కత్తిపోట్లు

భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్‌ నవలా రచయిత, బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై దాడి జరిగింది. ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగానికి సిద్ధమవుతుండగా.. ఆయన వైపు దూసుకొచ్చిన దుండగుడు స్టేజిపైనే కత్తితో దాడి చేయడం గమనార్హం. అమెరికా న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సమావేశానికి రష్దీ హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రుణగ్రహీతలను వేధించొద్దు.. రికవరీ ఏజెంట్లపై కొరడా.. ఆర్​బీఐ కొత్త రూల్స్!

రుణ వసూళ్ల విషయంలో రికవరీ ఏజెంట్ల దారుణాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రికవరీ ఏజెంట్లను నియంత్రించాలని స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపే రుణ రికవరీ ఏజెంట్లు, రుణగ్రహీతలకు ఫోన్‌ చేయాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రపంచం అంతా ఓవైపు.. టీమ్​ఇండియా మరోవైపు.. క్రికెట్​ మ్యాచ్​ ఎప్పుడంటే?

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా.. ఇండియా వర్సెస్​ రెస్ట్ ఆఫ్​ ది వరల్డ్​ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల ఈ మ్యాచ్​ జరగనుంది. ఇండియాకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కెప్టెన్​కు వ్యవహరించనున్నాడు. ప్రతిష్టాత్మక కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​​ వేదికగా ఈ మ్యాచ్​ను బీసీసీఐ నిర్వహిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సీక్వెల్స్​ జోరు.. అంచనాలు పెంచారు.. ఇక రావడమే ఆలస్యం!

'బాహుబలి', 'కేజీయఫ్'​ సీక్వెల్స్​ ఘన విజయాన్ని అందుకోవడంతో కొనసాగింపు చిత్రాల హవా కాస్త ఎక్కువగానే పెరిగింది. ఇప్పటికే విడుదలైన 'పుష్ప', 'విక్రమ్​' తొలి భాగం సూపర్ హిట్​ కావడం వల్ల రెండో భాగంపై బాగా ఆసక్తి పెరిగింది. అయితే దీంతో పాటే మరి కొన్ని కొనసాగింపు చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.