- ప్రజలను బురదలో వదిలేసి.. సీఎం గాల్లో తిరుగుతున్నారు: చంద్రబాబు
వరద బాధితులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కనీసం తాగునీరూ ఇవ్వలేకపోయారని విమర్శించారు. తాను వస్తున్నానని ఇప్పుడు రెండేసి వేలు ఇచ్చారని అన్నారు. గురువారం పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజలను బురదలో వదిలేసి ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ నెం.1గా నిలవాలి: సీఎం జగన్
Ap CM Jagan: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనకు ఇప్పుడు జరుగుతున్నంత ప్రయత్నం గతంలో ఎప్పుడూ లేదని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఎస్‌డీజీ సాధన దిశగా కృషి చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని తెలియజెప్పడం అంతే అవసరమని పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రామాణిక నిర్వహణ విధానాల్ని (ఎస్‌ఓపీ) రూపొందించుకుని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇసుకే బంగారమాయె.. గుత్తేదారు జేపీ సంస్థ మాయాజాలం
అందరికీ అందుబాటులో ఇసుక ఉంటుందని.. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇస్తామని గనులశాఖ పత్రికా ప్రకటనలు ఇస్తోంది. అది చూసి ఇసుక కొనాలని వెళ్తే.. దొరకట్లేదు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఇసుక ధరలు పేర్కొన్నా.. మూడుచోట్లే అమ్ముతున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చరిత్రాత్మక సభకు అనారోగ్యం వల్ల వెళ్లలేకపోతున్నా: పవన్
రామ్‌నాథ్ కొవింద్ తన అయిదేళ్ల పదవీకాలంలో ఎటువంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించటం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనమని జనసేన అధినేత పవన్ కొనియాడారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్నకొవింద్ వీడ్కోలు సభ రేపు దిల్లీలో జరగనుండగా..తనకు ఆహ్వానం అందిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లంక కొత్త అధ్యక్షుడిగా విక్రమసింఘె ప్రమాణం.. గొటబాయకు టూరిస్ట్ వీసా!
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న లంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం 20-25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు, సింగపూర్‌లో ఉన్న గొటబాయ రాజపక్సకు 14 రోజుల టూరిస్ట్ వీసా మంజూరు చేశారు ఆ దేశ అధికారులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రథమ పీఠంపై గిరి పుత్రిక.. భారీ ఆధిక్యంతో ముర్ము ఘన విజయం
Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయ కేతనం ఎగురవేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ఆమే. గురువారం దిల్లీలో ముర్ము తాత్కాలిక నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లి అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇండిగో విమానంలో ప్యాసింజర్ హల్చల్.. బ్యాగ్‌లో బాంబు ఉందంటూ..
పట్నా నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు.. తన బ్యాగులో బాంబు ఉందని చెప్పి హల్చల్ సృష్టించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు అధికారులు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ@4 .. బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి
Gautam Adani: దేశంలో అత్యంత సంపన్నుడిగా అవతరించిన అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ.. ప్రపంచ శ్రీమంతుల జాబితాలో దూసుకుపోతున్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానాన్ని అధిరోహించారు. గత 24 గంటల వ్యవధిలో అదానీ సంపద 337 మిలియన్ డాలర్ల మేర పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విండీస్‌తో వన్డే పోరుకు టీమ్ఇండియా రెడీ.. ధావన్ కెప్టెన్సీలో అమీతుమీ
ఇంగ్లాండ్‌పై వన్డే, టీ20 సిరీస్‌ల విజయం తర్వాత అదే ఉత్సాహంతో.. వెస్టిండీస్‌తో పోరుకు రెడీ అయ్యింది టీమ్ఇండియా. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో విండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సినిమా షూటింగ్‌లు బంద్.. ఆ రోజే తుది నిర్ణయం'
తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు. కొత్త సినిమాల నిర్మాణాన్ని ఆపే ఉద్దేశం తమకు లేదని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 23న జరిగే సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్‌తో కలిసి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 7 AM