సాధారణంగా 5 నుంచి 6 అడుగుల ఎత్తున్న వ్యక్తులను చూసుంటారు. కానీ 7.5 అడుగుల ఎత్తున్న వ్యక్తిని ఎప్పుడైనా చూశారా.. అలాంటి వ్యక్తిని చూస్తే మనకు ఒకింత ఆశ్చర్యం కలగక మానదు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వరదల నేపథ్యంలో విధుల కోసం వచ్చిన ఓ జవాన్ ఏకంగా ఏడున్నర అడుగుల ఎత్తు ఉండటంతో స్థానికులు ఆయనను ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగుతూ.. సంబుర పడిపోతున్నారు.
జమ్మూ రాష్ట్రానికి చెందిన సాయిల్.. ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన.. వరదల నేపథ్యంలో ప్రత్యేక విధుల కోసం భద్రాచలం వచ్చారు. ఈ క్రమంలోనే స్థానికులు ఆయనతో స్వీయ చిత్రాలు, ఫొటోలు దిగుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి.. ఈడీ విచారణకు సోనియా గాంధీ.. కాంగ్రెస్ నేతల నిరసనలు