హనుమకొండలో జరుగుతున్న 60వ జాతీయ అథ్లెటిక్ ఛాంఫియన్‌షిప్ పోటీల్లో ఉరిమే ఉత్సాహంతో క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోటాపోటీగా తలపడుతూ పతకాల వేట సాగిస్తున్నారు. ఈ పోటీలను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు.. వంద, రెండువందలు, నాలుగువందల మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, పోల్ వాల్ట్ తదితర పోటీల్లో సత్తా చాటుతున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో 48 విభాగాల్లో 573 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో క్రీడాకారుల ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్ అంజూ బాబీ జార్జ్... ఈ ఛాంపియన్‌షిప్‌ను రానున్న రోజుల్లో జరిగే క్రీడలకు మెట్టుగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రంలో సీపీ, కలెక్టర్, అథ్లెటిక్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: disha bill: దిశ బిల్లులపై ఉత్తర, ప్రత్త్యుత్తరాలతోనే కాలయాపన !