- పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ వి.కనగరాజు నియామకం రద్దు
పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్
వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. గంగిరెడ్డి గతంలో 201 సెక్షన్ కింద అరెస్టై బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం (AP Cabinet Meet) ముగిసింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమ తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CM Jagan: పెన్షన్ల విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్
మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు పలు సూచనలు జారీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్నారు. పెన్షన్ల విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Modi birthday: ప్రధాని బర్త్‌డే.. వ్యాక్సినేషన్లో ఆ రికార్డు కోసం..
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (Modi birthday) సందర్భంగా 1.5 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను (Vaccination in India) పంపిణీ చేయాలని భాజపా కృషి చేస్తోంది. మరోవైపు జైపుర్ ఫూట్ యూఎస్ఏ సంస్థ గుజరాత్లో మొబైల్ వ్యాన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Gujarat news: మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మంది
గుజరాత్లో కొత్త మంత్రివర్గం (Gujarat news) కొలువుదీరింది. రాజ్‌భవన్‌లో మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో అసెంబ్లీ మాజీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు జితూ విఘ్నానీ కూడా ఉన్నారు. అయితే.. మాజీ సీఎం విజయ్ రూపానీ కేబినెట్లోని ఒక్కరికి కూడా ఇప్పుడు చోటుదక్కకపోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మహిళలను మనుషుల్లానే చూడట్లేదు'
అఫ్గానిస్థాన్‌లో(Afghanistan news) భయంకర పరిస్థితులు ఉన్నాయని, మహిళలను(Afghanistan women) తాలిబన్లు కనీసం మనుషుల్లానైనా భావించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఆ దేశానికి చెందిన పలువురు మహిళా జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒకాయా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్- ధర తక్కువే
ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్ సంస్థ ఒకాయా పవర్ గ్రూప్.. ఫ్రీడమ్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను(Okaya Electric Scooter) విడుదల చేసింది. నాలుగు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ ధర చాలా తక్కువే అని చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Sonu sood Income tax: సోనూసూద్ నివాసాల్లో కొనసాగుతున్న సోదాలు
బుధవారం, గురువారం.. సోనూసూద్ నివాసాల్లో ఇంకా సోదాలు సాగుతున్నాయి. అయితే ఏం లభించింది అనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IPL2021: 'అలా జరగకపోతే పానీపూరీ అమ్ముకునేవాడిని'
ఒకానొక దశలో క్రికెట్‌ను పూర్తిగా వదిలేయాలని భావించినట్లు తెలిపాడు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్(sheldon jackson ipl 2021). ఆటలో తాను రాణించలేకపోయి ఉంటే పానీపూరీ అమ్ముకునేవాడినని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.