ETV Bharat / city

హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్​ దీపావళి కానుక

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ముంగిట నగరవాసులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. జీహెచ్​ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను 50శాతం రాయితీ ప్రకటించింది. ఇప్పటికే చెల్లించిన వారికి వచ్చే ఏడాది తక్కువ వసూలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. దీపావళి కానుకగా జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.14,500 నుంచి రూ.17,500 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వరద సాయం అర్హులందరికీ అందుతుందని మంత్రి భరోసా ఇచ్చారు.

ghmc property tax discount
హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్​ దీపావళి కానుక
author img

By

Published : Nov 14, 2020, 5:29 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరవాసులకు ఊరట కలిగేలా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ నిర్ణయాలు ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, సీఎస్ సోమేశ్‌కుమార్‌ సహా ఉన్నతాధికారులతో కేటీఆర్​ సమావేశమై... హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. అనంతరం హైదరాబాదీలకు కేటీఆర్​ వరాలు ప్రకటించారు.

కేసీఆర్​ కానుక

దీపావళి, కేసీఆర్​ కానుకగా 2020-21కి ఆస్తిపన్నులో ఉపశమనం కల్పించారు. జీహెచ్​ఎంసీ పరిధిలో గృహ యజమానులకు 50శాతం రాయితీ ప్రకటించారు. 15 వేల లోపు ఆస్తిపన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ నిర్ణయం వల్ల 31 లక్షల 40 వేల మందికి రూ.336.48 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. 140 పట్టణాల్లోనూ ఆస్తిపన్నులో రాయితీ కల్పిస్తామన్న మంత్రి.. ఇతర పట్టణాల్లో రూ.10వేల లోపు ఆస్తిపన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది తక్కువ వసూలు చేస్తామని కేటీఆర్​ హామీ ఇచ్చారు.

అండగా నిలిచారు

వరద బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. వరద బాధితులకు రూ.550కోట్లు రిలీఫ్‌ ఫండ్‌ విడుదల చేశారు. దసరా, దీపావళి వేళ ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఇప్పటివరకు 4,75,871 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.475 కోట్లు పంపిణీ చేశాం. దసరా సమయంలో 920 బృందాల ద్వారా లక్ష కుటుంబాలకు వరద సాయం అందించాం. వరదసాయం అందనివారు మీ-సేవాలో పేర్లు, ఇంటి, ఆధార్ నంబర్లు నమోదు చేసుకోవాలి. అధికారులు ఆ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సాయం అందిస్తారు. అవసరమైతే మరో వంద కోట్ల ఖర్చుకు ప్రభుత్వం వెనకాడబోదు. బ్యాంకు ఖాతా నంబరు ఇస్తే నేరుగా సాయం జమ చేస్తాం.

- కేటీఆర్

కార్మికులకు తీపి కబురు

దీపావళి కానుకగా జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి తీపి కబురు అందించారు. కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నట్లు వెల్లడించారు. కరోనా వల్ల ప్రభుత్వాలు, ప్రజల ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని తెలిపారు. ప్రభుత్వం పక్షాన ప్రజలకు సాయం అందించామన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ చాలా బాగా పనిచేసిందని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్​ ‌ప్రస్తావించారు.

ఇదీ చదవండి :

అద్భుత మేధస్సుతో అబ్బురపరుస్తున్న మూడేళ్ల 'జై'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.