ETV Bharat / city

engineering colleges:25 శాతం లోపు ప్రవేశాలుంటే ‘గుర్తింపు’ నిలిపివేత!

రాష్ట్రంలో గత మూడేళ్లలో 25 శాతంలోపు ప్రవేశాలున్న ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు నిలిపివేసేందుకు విశ్వవిద్యాలయాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రవేశాలు పెంచుకుంటామని గతేడాది హామీ ఇచ్చి, పరిస్థితి మెరుగుపడని వాటిపైనా చర్యలు తీసుకోనున్నాయి. మూడేళ్ల సరాసరి ప్రవేశాలను పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ కళాశాలల జాబితాను రూపొందించింది.

ఇంజనీరింగ్ కళాశాల
ఇంజనీరింగ్ కళాశాల
author img

By

Published : Sep 6, 2021, 8:53 AM IST

రాష్ట్రంలో గత మూడేళ్లలో 25 శాతంలోపు ప్రవేశాలున్న ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు నిలిపివేసేందుకు విశ్వవిద్యాలయాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రవేశాలు పెంచుకుంటామని గతేడాది హామీ ఇచ్చి, పరిస్థితి మెరుగుపడని వాటిపైనా చర్యలు తీసుకోనున్నాయి. మూడేళ్ల సరాసరి ప్రవేశాలను పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ కళాశాలల జాబితాను రూపొందించింది. దీన్ని విశ్వవిద్యాలయాలకు అందించనుంది.

జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 25%లోపు ప్రవేశాలున్న కళాశాలలు 18 ఉండగా.. జేఎన్‌టీయూ, కాకినాడ పరిధిలో 30వరకు ఉన్నాయి. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ జాబితాలో నుంచి వీటిని తొలగిస్తారు. అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు కళాశాలల మౌలిక సదుపాయాలు, ఇతర సమాచారాన్ని వర్సిటీలు ఆన్‌లైన్‌లో సేకరిస్తున్నాయి. వివరాల సేకరణ అనంతరం కొన్ని కళాశాలలను నేరుగా, మరికొన్నింటిని వర్చువల్‌లో తనిఖీ బృందాలు పరిశీలిస్తాయి.

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) 2021-22 విద్యా సంవత్సరానికి 258 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులు ఇచ్చింది. వీటికి ఆయా విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. వీటిల్లో 48 కళాశాలలపై చర్యలు తీసుకుంటే 210 కళాశాలలే కౌన్సెలింగ్‌ జాబితాలోకి వస్తాయి. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1,35,602 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది.

మరో 14 వర్సిటీల కళాశాలల్లో 4,260 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది 92 కళాశాలలకు అనుమతులు నిలిపివేసేందుకు జాబితా సిద్ధం చేయగా కొన్నింటి యాజమాన్యాలు పరిస్థితి మెరుగుపర్చుకుంటామని హామీ ఇవ్వడంతో 30 కళాశాలలపైనే వర్సిటీలు చర్యలు తీసుకున్నాయి.

ఇదీ చదవండి: వైకల్యాన్ని ఓడించి.. విజేతలుగా నిలిచి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.