రెండురోజుల క్రితం తెలంగాణ బాసరకు తీసుకొచ్చిన మూగ యువతి గీత తమ కుమార్తె అంటే తమ కుమార్తేనంటూ దాదాపు 40 కుటుంబాలవారు ముందుకొస్తుండడం విశేషం. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ఆమె తమ కుటుంబసభ్యురాలేనని చెబుతుండడంతో అధికారులు అయోమయంలో పడ్డారు.
చిన్నతనంలోనే భారత్ నుంచి తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరిన గీత తల్లిదండ్రులను గుర్తించడం కోసం అధికారులు ఆమెను బాసర తదితర ప్రాంతాలకు తీసుకువచ్చి వెదుకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహబూబాబాద్‌కు చెందిన దంపతులు ఆమె తమ కుమార్తేనని చెబుతుండగా తాజాగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన బొల్లి స్వామి గీత తమ బిడ్డేనంటూ గురువారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: