- Polavaram Visit: పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం: షెకావత్
పోలవరం నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. దేవీపట్నం మండలం ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వీక్షించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని షెకావత్ హామీ ఇచ్చారు.
- Justice for PRC: జీతాలు పెంచకుండా తగ్గించడమేంటి ?
విజయవాడలో జస్టిస్ ఫర్ పీఆర్సీ పేరుతో ఉపాధ్యాయులు, పీడీఎఫ్, స్వతంత్ర ఎమ్మెల్సీలు నిరసన దీక్ష చేపట్టారు. పీఆర్సీ, గ్రాట్యుటీ, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ డిమాండ్ చేశారు.
- పాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోంమంత్రి
పాలన వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు.
- Perni Nani: సీఎం టూర్లో.. మంత్రి పేర్ని నాని వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి పర్యటన సందర్భంగా కనివినీ ఎరుగని రీతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్ని నాని వాహనాన్ని సైతం పోలీసులు అడ్డగించడంతో.. వారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- 'ఉక్రెయిన్‌లోని భారతీయుల తరలింపుపై కేంద్రం చర్యలు భేష్'
ఉక్రెయిన్‌లోని భారతీయుల తరలింపుపై కేంద్రం చేపడుతున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రశంసించింది. విద్యార్థుల కుటుంబాల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించింది.
- ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు జవాన్లు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు సీఐఎస్ఎఫ్ జవాన్లు అక్కడిక్కడే మృతి చెందారు.
- 'మరో చెర్నోబిల్ అణువిపత్తుకు.. రష్యా ప్రయత్నం'
ఉక్రెయిన్‌లో అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేపట్టడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. రష్యా వైఖరిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుపట్టారు. చెర్నోబిల్ అణువిపత్తును పునరావృతం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ.
- ఖర్చుల నియంత్రణ కోసం ఓ బ్యాంకు ఖాతా!
ఉద్యోగులకు నెలనెలా జీతం శాలరీ ఖాతాలో జమ అవుతుంది. అందులో నుంచే అన్ని ఖర్చులూ, రుణ వాయిదాలూ వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటారు. దీనికి బదులుగా ఖర్చుల కోసం రెండో బ్యాంకు ఖాతాను ఉపయోగించే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ఖర్చుల మీద నియంత్రణ పెరుగుతుంది.