- జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత
Japan former pm Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) కన్నుమూశారు. శుక్రవారం దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రాణాలు విడిచినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అబే ఒక్కసారిగా ఛాతీపై చేయి పెట్టుకొని కుప్పకూలిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Y.S. Vijayamma Resign: వైకాపాకు 'అమ్మ రాజీనామా'.. కుమార్తె కోసం
YS Vijayamma Resignation: గుంటూరు జిల్లా చినకాకానిలో జరుగుతున్న వైకాపా ప్లీనరీ వేదికగా.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- YSRCP Plenary: అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం: సీఎం జగన్
YSRCP Plenary: అధికారమంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారమంటూ నిరూపించామని వైకాపా అధినేత, సీఎం జగన్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల కోసమే బతికామని చెప్పారు. 2009 నుంచి ఇప్పటివరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- PROTEST: పాఠశాలల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు
PROTEST: పాఠశాలల విలీనంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మా బడి మాకే కావలంటూ విద్యార్థుల నినదిస్తున్నారు. చిన్నారులను దూర ప్రాంతాలకు పంపలేమంటూ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దిగివచ్చే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని తేల్చిచెబుతున్నారు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వరదలో చిక్కుకున్న పాఠశాల బస్సు.. 25 మంది విద్యార్థులు సేఫ్
School Bus Stuck in Flood: మహబూబ్‌నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెనుప్రమాదం తప్పింది. మాచన్‌పల్లి-కోడూరు మధ్య ఓ ప్రైవేటు పాఠశాల బస్సు రైల్వే అండర్ బ్రిడ్జిలో చేరిన వరదనీటిలో చిక్కుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌కు సుప్రీంలో ఊరట.. పోలీసులకు నోటీసులు
Mohammad Zubair Bail: హిందూ దేవతను అవమానించాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు 5 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరోసారి సుప్రీంకు ఉద్ధవ్ వర్గం.. శిందే నియామకంపై సవాల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఉద్ధవ్ వర్గం. ఈ వ్యాజ్యంపై ఈ నెల 11న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు శివసేన పార్టీ గుర్తు తమ నుంచి శిందే వర్గానికి వెళ్లిపోయినా కొత్త గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టాక్ మార్కెట్లలో లాభాలు రావాలా? ఈ వ్యూహాలను పాటిస్తున్నారా మరి!
Stock Market Investment Tips: మార్కెట్‌లో కొన్ని నెలలుగా దిద్దుబాటు చోటు చేసుకోవడం చూస్తున్నాం. పెట్టుబడి పెట్టేవారు ఇలాంటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. మార్కెట్ పయనం ఎటువైపున్నా.. ఆయా దశల్లో మదుపు చేసి, లాభాలను సంపాదించేందుకు సరైన వ్యూహాల్ని, క్రమశిక్షణతో ఆచరించాలి. అవేమిటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా
Rohithsharma record: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించడంతో ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉత్కంఠగా 'పరంపర సీజన్ 2' ట్రైలర్.. ఊపేస్తున్న నితిన్-అంజలి మాస్ సాంగ్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో 'పరంపర' సీజన్ 2 ట్రైలర్, నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సాంగ్ ప్రోమో, ఆది 'క్రేజీ ఫెలో' రిలీజ్ డేట్ సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.