తెలంగాణలో కొత్తగా 324 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,62,526కు చేరింది. తాజాగా కొవిడ్‌తో ఒకరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,899కి చేరింది. మరో 280 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా..రాష్ట్రంలో ఇప్పటివరకు 6,53,302 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 5,325 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ 73,323 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 67,246 మంది ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో పరీక్షలు చేయించుకోగా.. 6,077 ప్రైవేట్ టెస్టులు చేయించుకున్నారు.
జీహెచ్ఎంసీలో కొత్తగా 79 కేసులు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లాలో 4, భద్రాద్రి కొత్తగూడెం 5, జగిత్యాల 11, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 4, కామారెడ్డి 2, కరీంనగర్ 22, ఖమ్మం 24, మహబూబ్‌నగర్ 5, మహబూబాబాద్ 7, మంచిర్యాల 8, మెదక్ 3, మేడ్చల్ 15, నాగర్ కర్నూల్ 4, నల్గొండ 19, నిర్మల్ 2, నిజామాబాద్ 3, పెద్దపల్లి 12, రాజన్న సిరిసిల్ల 11, రంగారెడ్డి 18, సంగారెడ్డి, 6 సిద్దిపేట 8, సూర్యాపేట 7, వికారాబాద్ 4, వనపర్తి 4, వరంగల్ 10, హనుమకొండ 12, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట, జోగులాంబ గద్వాల, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఇదీ చదవండి: TDP leaders : వైకాపా ప్రభుత్వ వైఖరిపై తెదేపా నేతల ఆగ్రహం