- మరికాసేపట్లో జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం, తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న వేళ... మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మాస్కు పెట్టుకోమంటే దారుణంగా కొట్టారు
నెల్లూరు టూరిజం కార్యాలయంలో ఉద్యోగినిపై దాడి చేసిన మేనేజర్ భాస్కర్‌ను మంత్రి అవంతి విధుల నుంచి తప్పించారు. తనపై మేనేజర్‌ను కావాలనే కొందరు ఉసిగొల్పారని.. మాస్కు పెట్టుకోమన్నందుకే తనను విచక్షణారహితంగా కొట్టారని బాధితురాలు ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేంద్ర జలశక్తి నివేదికపై సమాధానమేది
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి స్పష్టం చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. అవినీతి జరిగిందని పుస్తకాలు ముద్రించి రాద్ధాంతం చేసిన వైకాపా ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వం కేవలం 20 శాతం పనులు పూర్తిచేసిందని ఆరోపించిన వైకాపా.. నవంబరులో 40 గేట్లు బిగిస్తామని ఎలా చెప్పిందని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమిత్ షా ట్వీట్ ఫేక్
జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతర్జాలాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. హోంమంత్రి అమిత్ షా పేరిట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ట్వీట్ ఫేక్ అని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సామూహిక ఖననం
ఇటీవల కరోనా మృతదేహాల అంత్యక్రియల నిర్వహణపై పలు వార్తలు ఆందోళన కలిగించాయి. కొన్ని చోట్ల ఎలాంటి నిబంధనలు పాటించకుండా మృతదేహాలను ఖననం చేస్తున్నారు. అయితే తాజాగా కరోనా మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తోన్న ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కర్ణాటక బళ్లారి జిల్లాలో ఇది జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆర్డినెన్స్' రూపం
బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ పాలనను కట్టుదిట్టం చేసి, ఆర్థిక మధ్యవర్తులపై నియంత్రణ పెంచాలనే సదుద్దేశంతో భారత ప్రభుత్వం 1949-బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి సవరణలు చేసింది. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పుడు భారతీయ రిజర్వు బ్యాంకు తగిన సమయంలో స్పందించి సంక్షోభాన్ని నివారించే విధంగా ఆర్డినెన్సు తీసుకొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యాప్స్ నిషేధంపై చైనా స్పందన..
చైనా యాప్‌లను భారత్ నిషేధించిన అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ అంతర్జాతీయ, స్థానిక చట్టాలను అనుసరించి వ్యాపారాలు నిర్వహించాలని చైనా వ్యాపార సంస్థలకు చెబుతుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ద్రవిడ్ క్యాచ్ పడితే అంతే!
రాహుల్ ద్రవిడ్‌ను మిస్టర్ డిపెండబుల్, ది వాల్ అని కీర్తిస్తుంటారు అభిమానులు. బ్యాటింగ్‌కు దిగాడంటే బౌలర్ల సహనానికి పరీక్షే. అతడి ఆటతీరుకి ఫిదా అవ్వని క్రికెట్ ఫ్యాన్స్ ఉండరు. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ద్రవిడ్‌ది ప్రత్యేక బాటే. ఎక్కువగా స్లిప్, గల్లీల్లో పీల్డింగ్ చేసే ఈ ఆటగాడు క్యాచ్‌లు పట్టడంలోనూ దిట్ట. అందుకు సాక్ష్యం ఈ వీడియోనే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సుశాంత్‌కు ఆస్కార్ గెలిచే టాలెంట్ ఉంది'
సుశాంత్ రాజ్‌పుత్ ఆకస్మిక మృతికి బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ సంతాపం తెలిపారు. అతని మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా పేర్కొన్నారు. సుశాంత్ చనిపోవడానికి మానసిక ఒత్తిడే కారణమంటున్న తరుణంలో.. ఇది ఒక వ్యాధిలాంటిదని సెలీనా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహేశ్ ఫ్యామిలీకి రష్మిక సర్ప్రైజ్ గిఫ్ట్
లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు సినీతారలు. ఈ ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ లాక్డౌన్ సమయంలో హీరోయిన్ రష్మిక, మహేశ్ బాబు కుటుంబానికి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారు. అదేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.