ETV Bharat / city

రూ.2,800కు కొన్నారు.. రూ.45 వేలకు అమ్ముతున్నారు..! - వరంగల్‌ నేర వార్తలు

'రెమ్​డెసివిర్' ఇంజక్షన్లను బాక్ల్ మార్కెట్​లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ దందాపై సమాచారం అందుకున్న తెలంగాణలోని వరంగల్ టాస్క్​ఫోర్స్, సుబేదారి పోలీసులు సంబంధిత ఆసుపత్రి మందుల దుకాణంపై దాడులు నిర్వహించారు. వారి నుంచి 28 రెమ్​డెసివిర్ ఇంజక్షన్లతో పాటు 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

police caught remdesvir illegal sellers
అక్రమంగా రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్
author img

By

Published : May 6, 2021, 9:02 PM IST

రెమ్​డెసివిర్ ఇంజక్షన్లతో బాక్ల్ మార్కెట్ దందాకు పాల్పడుతోన్న ముగ్గురు సభ్యుల ముఠాను తెలంగాణలోని వరంగల్‌ పోలీసులు అరెస్ట్​ చేశారు. కరోనా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయాల్లో అందించే రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను.. ఎంఆర్​పీ కన్నా అత్యధిక ధరలతో అమ్ముతున్న ఈ ముఠాను వరంగల్‌ టాస్క్​ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్​చేశారు. వీరి నుంచి 28 ఇంజక్షన్లతో పాటు రూ. 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఎక్కువ మంది బాధితులు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి తెలిపారు. కరోనా చికిత్సలో భాగంగా అత్యవసర సమయంలో అందించే రెమ్​డెసివిర్ ఇంజక్షన్ల వినియోగం ఎక్కువ అయిందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో.. ఇదే అదునుగా భావించి స్థానిక ఆసుపత్రులు, మెడికల్​ షాపుల వారు బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.

నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్న ఈ ముఠా సభ్యులు హెటిరో ఫార్మా నుంచి రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను ఒక్కొక్కటి రూ.2,800 కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో బాధితులకు రూ.45వేల వరకు విక్రయిస్తున్నారని తరుణ్ జోషి తెలిపారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కరోనా కల్లోలం... కొత్తగా 21,954 కేసులు, 72 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.