రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,620మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా కరోనా నుంచి 7,504మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 17,82,680కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,140 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో పోరాడుతూ తాజాగా 44మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12,363 మందికి చేరింది. చిత్తూరులో అత్యధికంగా 10మంది మృతి చెందగా, గుంటూరు 5, శ్రీకాకుళం 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 3, కర్నూలు 3, ప్రకాశం 3, విశాఖపట్నం 3, పశ్చిమగోదావరి 3, కృష్ణా 2, కడప 1, నెల్లూరు 1, విజయనగరం ఒకరు కన్నుమూశారు.
ఇదీ చదవండి: