తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,92,835కు చేరింది. మహమ్మారితో మరో ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు 1,586 మంది మృతిచెందారు. కరోనా నుంచి తాజాగా 351 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,87,468 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 3,781 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 2,178 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 38 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి : పంచాయతీ ఎన్నికలు: తొలిదశ నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సమాయత్తం