తెలంగాణాలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అంతర రాష్ట్ర సరిహద్దు వద్ద లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వలసకూలీలు రాష్ట్రంలోకి వస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు. 207 మంది వలస కూలీలకు ఆరోగ్య పరీక్షల అనంతరం వారిని తెలంగాణ అధికారులు ఆంధ్రాకు పంపించారు.
ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన 168 మంది, ఒంగోలు జిల్లా వారు నలుగురు, గుంటూరుకి చెందిన 29 మంది, కడప జిల్లాకు సంబంధించిన ఇద్దరు, నెల్లూరుకు చెందిన ఒక్కరు ఉన్నారు. వీరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం... 6 బస్సుల్లో వారి వారి స్వస్థలాలకు తరలించారు.
ఇదీ చూడండి: