- నెల రోజులపాటు పాఠశాలలు ఒక్క పూటే: మంత్రి సురేష్
రాష్ట్రంలోని పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- పరామర్శించడానికి వెళ్తే కేసులు పెట్టడమేంటీ?: లోకేశ్
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తనపై ప్రభుత్వం అకారణంగా కేసులు నమోదు చేస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- స్థానిక ఎన్నికలపై అభిప్రాయాల వెల్లడికి ఆహ్వానం
స్థానిక సంస్థల ఎన్నికలపై అభిప్రాయాలు వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 18 రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఈనెల 28న నిర్వహించే సమావేశంలో ఒక్కో పార్టీకి పది నిమిషాలు కేటాయించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- మరికొన్ని గంటల్లో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మరి కొన్ని గంటల్లో జరగనుంది. పైడితల్లి సిరిమానోత్సవం రాష్ట్ర పండుగగా జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తమిళనాడులో భాజపా నేత కుష్బూ అరెస్ట్
భాజపా నేత కుష్బూను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనుస్మృతి, మహిళలపై వీసీకే నేత తిరుమలవలన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టేందుకు చిదంబరం బయలు దేరిన కుష్బూను మార్గ మధ్యలో పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- దేశవ్యాప్తంగా ఐటీ దాడులు - భారీగా నగదు జప్తు
దేశవ్యాప్తంగా ఎంట్రీ ఆపరేషన్ పేరుతో డబ్బును అక్రమంగా సృష్టిస్తున్న పలువురి ఇళ్లల్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో భారీగా నగదు, ఆభరణాలను జప్తు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- సూర్యరశ్మి పడే చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలు
చంద్రుడి ఉపరితలంలో సూర్యకిరణాలు పడే భాగంలో తొలిసారిగా నీటి జాడలను గుర్తించింది నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ). ఇప్పటివరకు చంద్రుడి ఉపరితలంలోని మంచు, నీడతో కూడిన ప్రాంతాల్లోనే నీటి అణువులు ఉంటాయని భావించారు. అయితే నాసా చేపట్టిన 'స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ ఆస్ట్రోనమీ' (సోఫియా) అబ్జర్వేటరీ ద్వారా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఇది అంతరిక్ష పరిశోధనల్లో కీలక పరిణామమని పరిశోధకులు భావిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- పాకిస్థాన్‌లో పేలుడు- ఏడుగురు మృతి
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జరిగిన పేలుడు ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో 70మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'నేను రిటైర్ అవ్వడం వారికి ఇష్టం లేదు'
జట్టులోని యువ ఆటగాళ్లు తనను రిటైర్ కావొద్దని కోరుతున్నారని క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ తెలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, కోల్‌కతాపై విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మ్యాచ్ అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- నటిపై కత్తితో దాడి చేసిన ఫేస్బుక్ స్నేహితుడు
బాలీవుడ్ నటి మాల్వి మల్హోత్రాపై యోగేశ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడం వల్ల ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.