- తెదేపా నేతల అక్రమ అరెస్ట్‌లను ఖండించిన చంద్రబాబు
హంద్రీనీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ... తెదేపా తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవటంతో పాటు నాయకులను అరెస్టు చేయటాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. తక్షణమే అక్రమ కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పోలవరం బాధ్యత కేంద్రానిదే: మంత్రి అనిల్
2014 లెక్కలతో పోలవరాన్ని నిర్మించలేమని.... కేంద్రమే ప్రాజెక్టు పూర్తి చేసేలా పోరాడతామని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న సంచైత గజపతిరాజు
మాన్సాస్ ట్రస్టు ఛైర్పర్సన్ సంచైత గజపతిరాజు విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అధ్యక్షురాలు హోదాలో తొలిసారిగా అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి చల్లని చూపులు, కరుణాకటాక్షాలు అందరిపైన ఉండాలని...కొవిడ్ పూర్తిగా తొలిగిపోయి... ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- చచ్చినా వదలడు... జంతు కళేబరాలతో వ్యాపారం..
అనారోగ్యంతోనో.. ఇతర కారణాలతోనో మృత్యువాత పడిన పశువులను కొనుగోలు చేసి వాటి మాంసాన్ని ఎగుమతి చేస్తున్నాడో వ్యక్తి.. ఆదాయం కోసం మూగ జీవాల కళేబరాలతో వ్యాపారం చేస్తున్నాడు.. చుట్టు పక్కలంతా దుర్వాసన వ్యాపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో ఈ వ్యవహారం జరుగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కేంద్ర మాజీ మంత్రి 'దిలీప్ రే'కు మూడేళ్ల జైలు
బొగ్గు బ్లాక్‌ను కేటాయించడంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు శిక్ష ఖరారు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఆయనతో పాటు మరో ఇద్దరికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశ రాజధానిలో అత్యల్ప స్థాయికి వాయు నాణ్యత
దిల్లీలో సోమవారం వాయు నాణ్యత అత్యల్ప స్థాయికి పడిపోయింది. రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ఆపకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'మెక్సికోలో వాస్తవానికి భిన్నంగా కరోనా మృతుల సంఖ్య'
కరోనా ధాటికి విలవిలలాడుతున్న మెక్సికోలో మరో ఆందోళనకర వార్త బయటకు వచ్చింది. కరోనా సంక్షోభంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రస్తుత లెక్కల కన్నా 50వేలు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. మొత్తం మీద ఈ ఏడాది 26వరకు 1,93లక్షల అదనపు మరణాలు నమోదైనట్టు.. వీటిల్లో 1.39లక్షలు కరోనాకు చెందినవేనని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదువార్త. ఈ ఏడాది ఐపీఎల్లో ప్లే ఆఫ్స్‌కు చేరుకోకుండానే సీఎస్కే వైదొలిగింది. తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా తొలి నాలుగు స్థానాల్లో చోటు సంపాదించుకోవడం కష్టం. దీంతో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టనుంది చెన్నై. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్'కు మద్దతుగా పాండ్యా
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన అర్ధశతకం పూర్తయిన తర్వాత మోకాలిపై కూర్చొని 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్'కు మద్దతు తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వీరు వయసులోనే కాదు.. ఫిట్‌నెస్‌లోనూ సీనియర్లే!
'మా అభిమాన హీరో కండలు మెలితిరిగిన వీరుడు' అని గర్వంగా చెప్పుకుంటూ ఆనందపడుతుంటారు కొందరు సినీ ప్రేమికులు. కానీ, వయసు మళ్లిన బాలీవుడ్ నటుల్లోనూ ఫిట్నెస్ వీరులున్నారు. 60 ఏళ్లకు పైబడినా.. వారి ఫిటినెస్‌ను కాపాడుకుంటూ ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తామని అంటున్నారు. వారెవరో చూద్దాం.