- పూడిమడక తీరంలో గల్లంతైన ఐదు మృతదేహాలు లభ్యం.. కొనసాగుతున్న గాలింపు
పూడిమడక తీరంలో గల్లంతైన వారిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా గాలింపు చర్యలు సాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంత్రి మేరుగ నాగార్జునకు త్రుటిలో తప్పిన ప్రమాదం
ACCIDENT: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వారధి నుంచి బందర్ రోడ్డువైపు వస్తుండగా విజయవాడలో కారు ప్రమాదానికి గురైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ప్రైవేట్ ఆస్తులు దోచుకునేందుకే.. రాజధానిపేరుతో కొత్త నాటకం'
రాజధాని గ్రామాల్లో భాజపా రెండోరోజు పాదయాత్ర కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి జైకొట్టిన జగన్... అధికారం చేపట్టిన వెంటనే మూడుముక్కలాట మొదలుపెట్టారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. విశాఖలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు దోచుకునేందుకే రాజధాని పేరిట కొత్త నాటకానికి తెరలేపారన్నారు. అమరావతికి మోదీ, అమిత్‌షా ఆశీస్సులు ఉన్నాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాపట్లలో విషాదం.. నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
DIED: నీటి కుంటలు, బోరుబావులు అభంశుభం తెలియని చిన్నారులు పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. ఆడుకోవడానికని, ఈతకొట్టడానికని వెళ్లిన వారిని విగతజీవులుగా మారుస్తున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారులు.. మృతదేహాలుగా మారడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. త్రుటిలో తప్పించుకున్న బైకర్
హిమాచల్‌ప్రదేశ్ సోలన్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ధాటికి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో బద్ది సమీపంలోని ఓ నదిలో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ఆ వాహనం మీద ముగ్గురు చిక్కుకుపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్కేటింగ్‌లో చిన్నారి గిన్నిస్ రికార్డ్.. 13.74 సెకన్లలో 20 కార్ల కింద నుంచి..
Limbo Skating Girl Guiness Record: కఠినమైన లింబో స్కేటింగ్‌ను ఆ చిన్నారి అలవోకగా చేస్తోంది. ఏడేళ్ల వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? ఆమె చేసే విన్యాసాలు ఏంటో తెలుసుకుందాం పదండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మనం ఎందుకు నిద్రించాలి? జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయో తెలుసా?
మానవులు ఎందుకు నిద్రించాలి? కొన్ని వేల సంవత్సరాలుగా శాస్త్రవేత్తల మదిలో ఉన్న ప్రశ్న ఇది. మానవుల్లో జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి? ఈ గుట్టు విప్పే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా కొన్ని విషయాలను వెల్లడించారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో బాంబ్ బ్లాస్ట్.. పరుగులు తీసిన జనం
అఫ్గానిస్థాన్.. కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ష్పగీజా క్రికెట్ లీగ్‌లో భాగంగా టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆటగాళ్లను అధికారులు బంకర్‌లోకి తరలించారు. భయంతో జనం పరుగులు తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- న్యూ లుక్‌తో షేక్ చేస్తున్న స్టార్ హీరో..
టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో గుర్తుపట్టలేనంతగా మారారు. బ్రౌన్, వైట్ కలర్ జుట్టు.. చెవి పోగులు, నోటిలో సిగెరెట్టు, స్టైలిష్ కళ్లద్దాలు.. ఇలా మాస్, రఫ్ లుక్‌లో ఆయన కొత్త అవతారం ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ హీరో న్యూలుక్ చూసిన తోటి నటీనటులు సైతం.. ''సార్.. మీరేనా?'' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? న్యూ లుక్ కథేంటంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.