ETV Bharat / city

top news: ప్రధాన వార్తలు @1PM - breaking news

..

1pm top news
1pm top news
author img

By

Published : Aug 1, 2021, 1:00 PM IST

  • కృష్ణానదికి పోటెత్తుతున్న వరద... ముంపు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ
    ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుతున్న దృష్ట్యా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టరు జె.నివాస్‌ విజ్ఞప్తి చేశారు. తన క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, నీటిపారుదల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు భారీగా వస్తోందన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'బీసీ కార్పొరేషన్ల నుంచి భారీగా నిధులు మళ్లించి.. వారి అభివృద్ధి ప్రశ్నార్ధకం చేశారు'
    బీసీల కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాం అంటున్న ప్రభుత్వం.. అందులో మళ్లించిన నిధుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ల నుండి 18,050 కోట్లు మళ్లించి.. బీసీల అభివృద్ధిని ప్రశ్నార్ధకం చేశారని ఆయన ఆరోపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సరకు రవాణాపై కరోనా పంజా.. ఆర్థిక ఇబ్బందుల్లో యజమానులు, డ్రైవర్లు
    కొవిడ్ మహమ్మారి వల్ల అనేక రంగాలు కుదేలయ్యాయి. రవాణా రంగం కూడా అందులో ఒకటి. ఓవైపు లాక్ డౌన్.. మరోవైపు కర్య్ఫూ కారణంగా సరకు రవాణా లేక లారీ యజమానులతో పాటు డ్రైవర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ONE RUPEE ONE IDLY: రూపాయికే ఇడ్లీ.. ఎక్కడో తెలుసా..?
    తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆర్‌బీ. కొత్తూరు గ్రామానికి చెందిన చిన్ని రత్నం లక్ష్మి(రాణి), చిన్ని రామకృష్ణ(రాంబాబు) దంపతులు రూపాయికి ఒక ఇడ్లీని అమ్ముతూ నిరుపేదల కడుపు నింపుతున్నారు. అలాగే మైసూరు బజ్జీలను కూడా ఒక్క రూపాయికే విక్రయుస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'టీకాతో సంబంధం లేదు- అందరిపైనా డెల్టా తీవ్ర ప్రభావం!'
    కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో.. వ్యాక్సినేషన్ స్టేటస్​తో సంబంధం లేకుండా డెల్టా వేరియంట్ వైరల్ లోడు ఉంటోందన్న అమెరికా సీడీసీ నివేదికపై భారత్​లోని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నివేదిక ఫలితాలు మన దేశానికీ వర్తిస్తాయని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా చికిత్సలో అశ్వగంధ- బ్రిటన్​లో అధ్యయనం
    కరోనా చికిత్సలో 'అశ్వగంధ'ను వినియోగించడంపై.. బ్రిటన్​తో కలిసి ఆయుష్​ మంత్రిత్వ శాఖ అధ్యయనం చేపట్టనుంది. బ్రిటన్​లోని 2,000 మంది పౌరులపై ఈ ఔషధానికి సంబంధించి క్లినికల్​ ట్రయల్స్​ త్వరలో నిర్వహించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'గ్లోబల్​ వార్మింగ్​ కట్టడిలో భారత్​, చైనా నిర్లక్ష్యం!'
    గ్రీన్​హౌస్ ఉద్గారాలను తగ్గించే దిశగా చేపట్టాల్సిన నూతన ప్రణాళికలను ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగానికి సమర్పించడంలో భారత్​, చైనా విఫలమయ్యాయి. 110 దేశాల్లో 82 దేశాలు.. నిర్దేశించిన గడువులోపు తమ లక్ష్యాలను సమర్పించ లేదని ఐరాస తెలిపింది. దేశాలన్ని కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే గ్లోబల్​ వార్మింగ్​ను రెండు శాతంలోపునకు పరిమితం చేయడం సాధ్యమవుతుందని చెప్పింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 4 నెలల్లో రూ.31 లక్షల కోట్ల సంపద వృద్ధి
    కరోనా వల్ల గత ఏడాది చారిత్రక నష్టాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత స్వల్ప కాలంలోనే కోలుకుని.. అంచనాలకు మించి దూసుకుపోతున్నాయి. మార్కెట్ల ఈ దూకుడుతో బీఎస్​ఈ నమోదిత కంపెనీల విలువ 2021-22 తొలి నాలుగు నెలల్లో రూ.31 లక్షల కోట్లు పెరిగింది. మార్కెట్ల దూకుడుకు విశ్లేషకులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పొట్టి ప్రపంచకప్​లో టీమ్ఇండియా జట్టు ఇదేనా!
    క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే టీ20 ప్రపంచకప్​కు ఇంకా ఎంతో సమయం లేదు. టీమ్​ ఇండియా జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా మంది పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన టీ20 స్వ్కాడ్​ను ప్రకటించారు ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RRR movie: ఆర్​ఆర్​ఆర్​ ట్రీట్​.. 'దోస్తీ' సాంగ్​ వచ్చేసింది​
    రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్' సినిమా(RRR movie) నుంచి​ ఫస్ట్​ సాంగ్​(దోస్తీ) విడుదలైంది. ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ గాయకులు ఈ పాటను ఆలపించడం విశేషం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.