- bangaru bonam : విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించిన తెలంగాణ
విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణలోని హైదరాబాద్ పాతబస్తీ వాసులు బంగారు బోనం సమర్పించారు. నగరంలోని జమ్మిచెట్టు సెంటర్ నుంచి దుర్గ గుడి వరకు ర్యాలీగా వెళ్లి బోనం సమర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విద్యార్థికోసం ప్రయాణం వాయిదా వేసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి రెడీ అవుతున్నారు. ఆయన రాక కోసం శంషాబాద్‌లో భద్రతా సిబ్బంది వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ కుర్రాడు వచ్చి.. ఆయన్ని కలవాలని.. బహుమతి ఇవ్వాలని సిబ్బందిని కాళ్లావేళ్లా పడుతున్నాడు. చివరికి అనుమతి సాధించాడు. నేరుగా ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్లి తన విజ్ఞప్తి చేశాడు. సమయం కావస్తోన్నా.. విద్యార్థిని ప్రోత్సహించటం కోసం.. ఏకంగా తన ప్రయాణాన్నే కాస్త వాయిదా వేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- UGC : బోధన - అభ్యసన ప్రక్రియను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా కొనసాగించొచ్చు
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నూతన విద్యా సంవత్సరాన్ని అక్టోబరు ఒకటి నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పేర్కొంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి సంవత్సరం ఆఖరి టర్మ్ పరీక్షలను ఆగస్టు 31 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. బోధన- అభ్యసన ప్రక్రియను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, మిశ్రమ విధానంలో కూడా కొనసాగించవచ్చని చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- petrol rate hikes: రాష్ట్రంలో అక్కడే ఎక్కువ పెట్రోల్ ధర..ఎంతంటే!
రోజురోజుకు చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు పెట్రోలు రూ. 110కు అమ్ముతున్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువగా ఉంది.నిల్వ కేంద్రాల నుంచి దూరానికి అనుగుణంగా అయ్యే రవాణాఛార్జీలే ఈ తేడాకు కారణమని ఇంధన సంస్థలు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అఖిల పక్ష సమావేశం- ప్రధాని హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా జరిగేలా సహకరించాలని ఈ భేటీలో విపక్షాలను కోరనుంది కేంద్రం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాలిబన్లతో జైషే, లష్కరే జట్టు- భారత్ పరిస్థితేంటి?
అఫ్గాన్‌పై విరుచుకుపడుతున్న తాలిబన్లకు జైషే మహమ్మద్, లష్కరే తొయిబా ఉగ్రసంస్థలు మద్దతు పలుకుతున్నాయి. తమ ఉగ్రవాదులను తాలిబన్ల పోరాటంలో భాగం చేస్తున్నాయి. ఇది భారత్‌కు కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రసాయన వాయువు లీక్- స్థానికులకు అస్వస్థత
వాటర్ పార్కులో రసాయన వాయువు లీక్ కావడం వల్ల స్థానికులకు చర్మ, శ్వాసకోస సమస్యలు తలెత్తాయి. అమెరికా హ్యూస్టన్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టోక్యోలో అడుగుపెట్టిన భారత 'ఒలింపిక్' బృందం
ఈ నెల 23 నుంచి జరగనున్న ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) పాల్గొనేందుకు భారత క్రీడాకారుల తొలి బృందం(First batch of Indian athletes) టోక్యో చేరుకుంది. ఆర్చరీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాలకు చెందిన 54 మంది క్రీడాకారులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Deepika Kumari: ఈసారి గురిచూసి కొట్టాలని!
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన ఏకైక భారతీయ మహిళా ఆర్చర్‌గా దీపికా కుమారి(Deepika Kumari) ఘనత నెలకొల్పింది. ఈ ఏడాది జరిగిన ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒకేరోజు మూడు స్వర్ణాలను సాధించి సత్తా చాటింది. ఇదే ఉత్సాహంతో టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo olympics) బంగారు పతకం సాధిస్తానంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- OTT Movies: ఈ వారం విడుదలయ్యే సినిమాలివే
అభిమానుల ఆనందాన్ని పెంచేందుకు మరికొన్ని సినిమాలు ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో నారప్ప, ఇక్కత్, సార్పట్ట చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. వాటి గురించే ఈ కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.