ETV Bharat / city

ప్రధాన వార్తలు @1PM - top ten news

...

top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Apr 6, 2021, 1:01 PM IST

  • సీజేఐగా జస్టిస్ ఎన్​.వి.​ రమణ- రాష్ట్రపతి ఆమోదం

భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఎన్​వీ రమణ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదం తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉన్నత పీఠంపై ఊరు బిడ్డ.. పులకించిన పురిటి గడ్డ

దేశానికి అత్యున్నత న్యాయాధీశుడిని అందించిన ఆ ఊరు మెరిసింది. ఓనమాలు దిద్దించిన అక్కడి బడి మురిసింది. మిత్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. సుప్రీంకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌గా నియమితులైన ఎన్వీ రమణ స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం సంతోషంతో పులకరిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అధికార లాంఛనాలతో జవాను జగదీశ్ అంత్యక్రియలు పూర్తి

ఛత్తీస్​గఢ్​లోని బీజాపూర్-సుకుమా సరిహద్దులోని జోనాగుడా వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన జగదీశ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జగదీశ్ స్వస్థలమైన విజయనగరం జిల్లా గాజులరేగులో.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యానాంలో సజావుగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

పుదుచ్చేరి రాష్ట్రంలో 15 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రారంభమైంది. 37,811 మంది ఓటర్లున్న యానాంలో.. 33 పోలింగ్‌ బూతులు, 27 ఉపపోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో రికార్డు స్థాయిలో టీకా పంపిణీ

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకా పంపిణీ జరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 43లక్షలకుపైగా మందికి వ్యాక్సిన్​ అందించింది ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా విజృంభణ- దిల్లీలో రాత్రి కర్ఫ్యూ

కరోనా విజృంభణ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ 30 వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'విదేశాలకు భారత​ టీకా సరఫరాపై కరోనా ఎఫెక్ట్​'

అనేక దేశాలకు కరోనా టీకా సరఫరా చేస్తూ వస్తోంది భారత్​. అయితే దేశంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో విదేశాలకు భారత్​ నుంచి వెళ్లే టీకాల సంఖ్య తగ్గే అవకాశముందని గవీ సీఈఓ బెర్క్​లే పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎనిమిది మందిని చంపి ఆత్మహత్య

ఇరాన్​లోని అహ్వాజ్​ నగరంలో ఓ దుండగుడు అతని కుమారుడు సహా ఏడుగురిని కాల్చి చంపాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాంఖడేలో మరో ముగ్గురు సిబ్బందికి కరోనా

ఐపీఎల్​కు ముందు కరోనా కలకలం రేపుతోంది. తాజాగా మరో ముగ్గురు వాంఖడే సిబ్బందికి కొవిడ్ నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్​ ధ్రువీకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నేను గర్భం దాల్చినందుకు ఈ పెళ్లి చేసుకోలేదు!'

పెళ్లికి ముందే గర్భవతినని చెప్పడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని అంటున్నారు బాలీవుడ్​ నటి దియా మీర్జా. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న ఈ హైదరాబాదీ భామ.. నెల వ్యవధిలోనే ఎలా గర్భం దాల్చారు? అని నెటిజన్లు అడిగిన ప్రశ్నలపై ఆమె స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.