- ఈనెల 27న హాజరుకావాల్సిందే.. హై కోర్టు ఆదేశం!
ఈనెల 27న కోర్టుకు హాజరుకావాలని డీజీపీ, హోం సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ అధికారికి పదోన్నతిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని పిటిషన్ పై విచారణ జరిగింది. కోర్టు ధిక్కారం కింద ఇద్దరూ హాజరుకావాలని గతంలోనే ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమని అధికారుల అఫిడవిట్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నామినేషన్ల ప్రక్రియ: ఆదేశాలు ఇవ్వని కలెక్టర్లు.. వెనక్కి వెళ్తున్న అభ్యర్థులు
రాష్ట్రంలో తొలిదశ స్థానిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. ఈ మేరకు.. గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని పంచాయతీ కార్యాలయాలకు అభ్యర్థులు తరలివెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు: ఆనంద్‌బాబు
రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు అన్నారు. రెండు స్వతంత్ర వ్యవస్థల నిర్ణయాన్ని ప్రభుత్వం లెక్క చేయట్లేదని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆజాద్ మైదానానికి పోటెత్తిన కర్షకులు
మహారాష్ట్ర నలుమూలల నుంచి ముంబయిలోని ఆజాద్ మైదానానికి భారీగా తరలివచ్చారు రైతులు. దిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా సభ నిర్వహిస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా.. మహారాష్ట్ర అధికార కూటమి మహా వికాస్ అఘాడీకి చెందిన ప్రముఖ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్- చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ
తూర్పు లద్దాఖ్ వివాదంతో భారత్, చైనా మధ్య ఓ వైపు ప్రతిష్టంభన కొనసాగుతుండగానే వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్లు ఘర్షణకు దిగినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'భారత యూజర్లపై వాట్సాప్ పక్షపాతం'
ఐరోపాలోని వాట్సాప్ యూజర్లతో పోలిస్తే భారత యూజర్లను వాట్సాప్ వేరుగా చూస్తోందని దిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం నివేదించింది. వినియోగదారుల సమాచార భద్రతా విషయంలో వాట్సాప్ ఆందోళనకరంగా వ్యవహరిస్తోందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బైడెన్ బృందంలో మరో నలుగురు భారతీయులు
అమెరికా పాలనా యంత్రాంగంలో భారత సంతతి వ్యక్తులకు.. అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే పెద్ద పీట వేశారు. తాజాగా మరో నలుగురు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు అప్పగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పేదలపైనే కరోనా మహమ్మారి ప్రభావం!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఆర్థిక అసమానతలు తీవ్రం అయ్యాయి. కొవిడ్ మహమ్మారి.. కుబేరులపై ఎలాంటి ప్రభావం చూపలేదని.. నష్టపోతున్నది పేదలేనని ఓ నివేదిక వెల్లడించింది. ఆర్థిక ఆసమానతలపై ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆసీస్ క్రికెటర్ల సంఘం చీఫ్‌గా రగ్బీ లీగ్ మాజీ సీఈఓ
ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ) కొత్త చీఫ్‌గా జాతీయ రగ్బీ లీగ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్ నియమితులయ్యారు. ఈ అవకాశం తనకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు గ్రీన్బర్గ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక భావోద్వేగం
తన పెళ్లి వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు మెగా డాటర్ నిహారిక. ప్రస్తుతం ఇది వైరల్ మారి మెగా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.