రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,986 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 197 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,85,234కు చేరింది. వైరస్ బారిన పడి తాజాగా ఇద్దరు చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 7,133కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 234 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,75,000కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,411 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కోటీ 24 లక్షల శాంపిల్స్‌ని పరీక్షించినట్లు బులెటిన్‌లో వెల్లడించింది.
ఇదీ చదవండి: