'ముఖ్యమంత్రి గారూ... మా ఉసురు పోసుకోవద్దు..!' - tullur farmers 16th day agitaitons news
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 16 రోజులుగా ఇళ్లు విడిచి నిరసనలు తెలుపుతున్న తమను మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించడంపై తుళ్లూరు అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాత్యులు రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తే నిజానిజాలు తెలుస్తాయని అన్నారు. తమ కన్నీటి ఉసురు పోసుకోవద్దని ముఖ్యమంత్రి జగన్కు సూచించారు. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకోకుంటే నిరసన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలను అమరావతి పరిధిలోని తుళ్లూరు నుంచి మా ప్రతినిధి అందిస్తారు.