ETV Bharat / city

ప్రధానవార్తలు11AM

.

11am topnews
ప్రధానవార్తలు11AM
author img

By

Published : Aug 12, 2022, 10:52 AM IST

  • శత్రువు గుండెల్లో కవాతు.. మన సైనిక బలం అమేయం.. రక్షణ రంగం పటిష్ఠం

సహనం, సాత్వికం, సమోన్నత సాంస్కృతిక నేపథ్యమున్న భారత్‌ది మొదటి నుంచీ కయ్యానికి కాలు దువ్వే స్వభావం కాదు. స్వాతంత్య్రం వచ్చాక మన పాలకులు సమర్థ విదేశాంగ విధానం, పరిపక్వత చెందిన దౌత్యమే దేశానికి బలమైన రక్షణ విధానమని నమ్మారు. పంచశీలను వంచించి, చైనా చేసిన దాడితో ఆ నమ్మకాలు వమ్మయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్థిరంగా కరోనా కేసులు.. చిన్నారులకు లాంగ్​ కొవిడ్​ ముప్పు!

భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. తాజాగా 16,561 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 24 గంటల వ్యవధిలో 18,053 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా బారిన పడ్డ కొందరు చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు తక్కువ తీవ్రతతోనే.. ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వైఎస్సార్ జిల్లా​లో .. భారీగా బంగారం పట్టివేత

పన్ను కట్టకుండా అక్రమంగా కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి కోయంబత్తూరుకు తీసుకెళ్తుండగా.. వైఎస్సార్​ జిల్లా చాపాడులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 3కిలోల బంగారంతో పాటు, రూ.1.30కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఖరీఫ్‌ సాగు.. కలవరమే.. అప్పటితో పోలీస్తే

గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతున్న.. ఖరీఫ్​ సాగు కలవరంగానే ఉంది. ఆరంభంనుంచి ఇప్పటివరకు మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వర్షపాతం సాధారణంగానే ఉన్నా 2021 ఆగస్టు 10నాటికి సాగైన విస్తీర్ణంతో పోలిస్తే 15 లక్షల ఎకరాలు తగ్గింది. ఖరీఫ్‌ సాగులో మూడేళ్లుగా పెరుగుతున్న నష్టాలతో సాహసించి ముందుకు సాగలేని పరిస్థితి దీనికి మరో కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలిని నరికి చంపిన అత్త

రాష్ట్రంలో రోజురోజుకూ హత్యలు పెరిగిపోతున్నాయి. తండ్రి మందలించాడని, కోడలు ఇంట్లో నుంచి బయటికి నెట్టిందని, ఆస్తి పంపకాలు సరిగా చేయడం లేదని, అక్రమ సంబంధాలు బయటపెడుతున్నారని ఏదోవిధంగా కక్ష పెంచుకుని.. తల్లిదండ్రులను కొడుకు చంపడమో లేక తోడబుట్టిన సోదరిని తమ్ముడు చంపడంలాంటివి చూస్తున్నాం. ఆలోచించి పరిష్కరించుకునే సహనం లేక అవతలి వారి ప్రాణాలను అవలీలగా తీసేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ బీచ్​లో ఇసుక నల్లగా మారింది.. ఎందుకో తెలుసా

ఎప్పుడూ బంగారంలా మెరిసిపోయే విశాఖ ఆర్‌కే బీచ్‌లోని ఇసుక గురువారం నల్లగా మారిపోయింది. ఈ మార్పును చూసి సందర్శకులు ఆందోళన చెందారు. ఇసుక అలా ఎందుకు మారిందోనని భయంతో అటు వైపు ఎవరూ అడుగు కూడా పెట్టలేదు. మాకు తెలిసినంత వరకు ఇలా ఎన్నడూ జరగలేదని స్థానికులు వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కొవిడ్‌'తో కిమ్‌కు తీవ్ర అనారోగ్యం ?

ఉత్తరకొరియాలో ఇటీవల కరోనా వైరస్‌ విజృంభించిన విషయం తెలిసిందే. ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారట. ఈ విషయాన్ని ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్ తాజాగా వెల్లడించారు. అయితే ఆయనకు కరోనా సోకిందా లేదా అన్న విషయంపై మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పర్సనల్ లోన్ తీసుకున్నారా? ఇవి మర్చిపోవద్దు!

రుణం తీసుకునేటప్పుడు నెలవారీ వాయిదా బ్యాంకు ఖాతా నుంచి నేరుగా వెళ్లేలా ఈసీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సిస్టం)కు అనుమతినిస్తాం. కాబట్టి, సమయానికి బ్యాంకులో వాయిదాకు సరిపడా డబ్బు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గతంలో ఆదివారాలు, సెలవు దినాల్లో ఈసీఎస్‌ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఇలాంటి వెసులుబాట్లు లేవు. ఎప్పుడైనా సరే.. నిర్ణీత తేదీ నాడు బ్యాంకు/ ఆర్థిక సంస్థకు వాయిదా వెళ్లిపోతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చెన్నై జట్టులో ఆర్సీబీ కెప్టెన్​!.. మరో స్టార్​ ఆల్​రౌండర్​ కూడా!!

ఐపీఎల్​ గత సీజన్లో రాయల్​ ఛాలెంజర్స్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు డుప్లెసిస్. అయితే వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న సౌతాఫ్రికా టీ20 లీగ్​లో సీఎస్​కే కొనుగోలు చేసిన జొహానెస్​బర్గ్​ ఫ్రాంఛైజీ తరఫున డుప్లెసిస్ ఆడనున్నాడట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గుండెపోటుతో నేషనల్​ అవార్డ్​ విన్నింగ్​ సింగర్​ కన్నుమూత

సినీఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ సింగర్​ శివమోగ సుబ్బన్న (83)కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అలాగే సుబన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.