ETV Bharat / city

ప్రధానవార్తలు @11AM

.

11AM TOPNEWS
ప్రధానవార్తలు @11AM
author img

By

Published : Aug 4, 2022, 10:59 AM IST

  • కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 19వేల కేసులు.. అమెరికాలో లక్షకు పైగా..

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 19,893 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.94శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 20,419 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వైకాపా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు

ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమం అశ్లీల నృత్యాలకు వేదికయింది. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో అశ్లీలంగా నృత్యాలు చేయించడంతో పాటు కొందరు వైకాపా కార్యకర్తలు వారితో కలిసి నృత్యాలు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ తతంగం సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆ పోస్టు ఎవరు పెట్టమన్నారు ?'.. తెలుగుయువత నాయకుడిని విచారించిన సీఐడీ

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ పథకాన్ని ఉద్దేశించి పోస్టు పెట్టాడనే ఆరోపణలతో తెలుగు యువత సోషల్‌ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్‌ చీరాల సునీల్‌ను బుధవారం గుంటూరు సీఐడీ పోలీసులు విచారించారు. అనంతరం తాము పిలిచినప్పుడు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని వ్యక్తిగత పూచీకత్తుపై 41 నోటీసు ఇచ్చి పంపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బురదలో కొట్టుకుపోయిన.. ప్రకృతి అందాలు..!

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని యడవల్లి- బోళ్లపల్లి గ్రామాల మధ్య నెల కిందటి వరకూ కనువిందు చేసిన ప్రకృతి అందాలపై ఇప్పుడు బురద పేరుకుపోయింది. ఇటీవల వచ్చిన గోదావరి వరద అక్కడున్న ఎద్దు వాగుకు పోటెత్తింది. పచ్చికబయళ్లు 20 రోజుల పాటు గోదావరి నీరు, బురదలో మునిగాయి. వరద తగ్గాక అడుగు మేర మట్టి మేట వేసి..బురదమయం అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భుజంపై కుమారుడి మృతదేహం.. కిలోమీటర్ల పాటు నడక.. ఆర్మీ సాయంతో..

కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఓ తండ్రి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబులెన్సు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సిబ్బందికి విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో భుజాలపైనే కుమారుడి మృతదేహాన్ని మోసుకెళ్లారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తైవాన్​ను వీడిన పెలోసీ.. అమెరికాను వదిలే ప్రసక్తే లేదన్న చైనా

యావత్‌ ప్రపంచానికి ఉత్కంఠ రేపిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన ఎట్టకేలకు ముగిసింది. చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ నిన్న రాత్రి ఆ దేశ రాజధాని తైపేలో అడుగుపెట్టిన పెలోసీ.. ఈ ఉదయం తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి యింగ్‌ వెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. సాయంత్రం తైపీ నుంచి దక్షిణకొరియా బయల్దేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మళ్లీ పెరిగిన బంగారం ధర.. పది గ్రాములు ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. బుధవారంతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.510 మేర పెరిగింది. మరోవైపు, వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి రూ.370 మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరణించిన వారి 'సోషల్​ మీడియా' ఖాతాల్లో పోస్టులు ఏమవుతాయి?

ట్విట్టర్​, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా లెక్కలేనన్ని సామాజిక మాధ్యమాలు. ఫొటోలు, వీడియోలు, అభిప్రాయాలు ఎన్నెన్నో పంచుకుంటాం. వీటిల్లో ఖాతా గలవారు మరణించిన తర్వాత వారి పోస్టులన్నీ ఏమవుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రభాస్​, కోహ్లీల 'హర్ ఘర్ తిరంగా' సాంగ్.. మనసంతా త్రివర్ణమే!

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బుధవారం 'హర్ ఘర్ తిరంగ' దేశభక్తి గీతాన్ని విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​, టాలీవుడ్​ హీరో ప్రభాస్‌తోపాటు హీరోయిన్ కీర్తి సురేష్, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్ కోహ్లీ తదితరులు నటించారు. ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోన్న ఈ వీడియో సాంగ్​ను మీరూ ఓ సారి చూసేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరిచుకునే ప్రయత్నం చేశా'

'లక్ష్మీ కళ్యాణం', 'పటాస్', 'అతనొక్కడే' వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు నందమూరి కళ్యాణ్ రామ్​. ఆయన తాజాగా 'బింబిసార' సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ 'ఈనాడు సినిమా'తో పలు విషయాలు ముచ్చటించారు. అవేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.