ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM - ap top ten news

.

11am_Topnews
ప్రధాన వార్తలు @11AM
author img

By

Published : Nov 29, 2020, 11:02 AM IST

  • ఉత్తరాంధ్ర రైతులపై పంజా విసిరిన నివర్‌ తుపాన్‌
    నివర్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ప్రభావం చూపకపోయినప్పటికీ... రైతులకు నష్టాలు అయితే తప్పలేదు. భీకర వర్షాలు లేకపోయినప్పటికీ.. గాలుల తీవ్రత రైతుల పాలిట శాపంగా మారింది. చేతికొచ్చిన పంట నెలపాలైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురు వల్ల చలి తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు తుపానులు రావచ్చనే హెచ్చరికల నేపథ్యంలో... రైతులతో పాటు సామాన్య ప్రజలూ భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నీటి ప్రవాహంలో చిక్కుకున్న కోవూరు ఎమ్మెల్యే
    ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. స్థానిక మత్స్యకారులు అతి కష్టం మీద ఎమ్మెల్యేను ఒడ్డుకు చేర్చారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పిటిషన్‌
    జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా పెన్నా సిమెంట్స్‌లో తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జీహెచ్​ఎంసీ ఎన్నికలతో జోరందుకున్న మద్యం అమ్మకాలు
    ఎన్నికల వేళ జీహెచ్​ఎంసీలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. డిపోల నుంచి దుకాణాలకు భారీగా లిక్కర్‌, బీర్‌ కేసులు సరఫరా అవుతున్నాయి. ఈ నెల 23 నుంచి 27వరకు 5 రోజుల్లోనే 572 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు చేరింది. మందుబాబులు 12 రోజుల్లో సాధారణం కన్నా 400 కోట్ల విలువైన మద్యం అధికంగా తాగేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లక్షణాలు ఉన్న వారితోనే వ్యాప్తి అధికం!
    కరోనా వ్యాప్తిపై చేసిన ఓ సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. కొవిడ్​ లక్షణాలు ఉన్నవారు మహమ్మారి వ్యాప్తిలో ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు స్పష్టం అయ్యింది. రోగి ఉన్న ఇంట్లో ఉండే వారికి వైరస్​ సోకే ప్రమాదం అధికంగా ఉందని సర్వే పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కొవిషీల్డ్ వికటించింది.. రూ.5 కోట్లు ఇవ్వండి'
    కొవిషీల్డ్ టీకా తనపై దుష్ప్రభావం చూపించిందని చెన్నైకి చెందిన ఓ వలంటీర్ ఆరోపించారు. టీకా ప్రయోగాల్లో పాల్గొన్న తనకు తీవ్రమైన సమస్యలు తలెత్తాయని.. ఇందుకు పరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా తయారీదారులతో పాటు, నియంత్రణ సంస్థలకు నోటీసులు పంపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరో వాయుగుండం! 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం
    దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో వాయుగుండం మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వన్డేల్లో భారత కెప్టెన్ కోహ్లీ మరో ఘనత
    అద్భుత బ్యాట్స్​మన్​గా, సారథిగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ వన్డేల్లో మరో మార్క్​ను అందుకున్నాడు. భారత్​ తరఫున 250 వన్డేలు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'హృతిక్​ అంటే పిచ్చి.. కానీ వరుణ్​ ధావన్​తోనే నటిస్తా'
    విజయ్​ దేవరకొండ - పూరి జగన్నాథ్​ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో హీరోయిన్​గా బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న సందర్భంగా తన ఇష్టాయిష్టాలతో పాటు సినిమా కబుర్లను పంచుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.